twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంస్కారం కాదు !:శర్వానంద్‌ పై దర్శక, నిర్మాత తీవ్ర ఆరోపణలు

    By Srikanya
    |

    చెన్నై: తెలుగులో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న హీరో శర్వానంద్. ఆయనపై తమిళ దర్శక,నిర్మాత చేరన్ ఆరోపణలు చేసారు. నమ్మి కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతను ఇబ్బంది పెట్టడం సంస్కారం కాదు అంటూ ఆయన చెన్నైలో మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేసారు. రీసెంట్ గా చేరన్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన రాజాధిరాజా చిత్రం రిలీజైంది. ఈ చిత్రం విషయమై ఆయన ఇలా మాట్లాడారు.

    చేరన్ మాట్లాడుతూ... 'నువ్వు మంచి నటుడివే. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ, నిన్ను నమ్మి కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతని ఇబ్బందిపెట్టడం సంస్కారం కాదు. డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చు కోవడం దురదృష్టకరం' అన్నారు.

    గత వారంలో విడుదలైన 'రాజాధిరాజా' చిత్రానికి శర్వా నంద్‌ నెగిటివ్‌ పబ్లిసిటీ చేస్తున్నారని ఆరోపిం చారు. ఈ మేరకు చేరన్ చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆయన ఆవేదన, ఆగ్రహాన్ని వెల్లడించారు.

    చేరన్ కంటిన్యూ చేస్తూ.. 'రాజాధిరాజా సినిమా చూసి నవాళ్లందరూ బాగుందంటున్నారు. కానీ, శర్వానంద్‌, నిర్మాత రవికిషోర్‌ ఈ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిసి చాలా బాధపడ్డాను అని అన్నారు. ఆయన చేసిన ఆరోపణలు క్రింద స్లైడ్ షోలో చదవండి..

    స్లైడ్ షోలో

    హిట్స్ లేనప్పుడు

    హిట్స్ లేనప్పుడు

    శర్వానంద్‌కి హిట్లు లేకముందు నేను ఈ సినిమాకి బుక్‌ చేశాను. అప్పుడు అతడి మార్కెట్‌ తక్కువ. కోటి రూపాయలు పారితోషకం మాట్లాడి, రూ.55 లక్షలు కూడా ఇచ్చాం. ఇంకా రూ.45 లక్షలు ఇవ్వాల్సి ఉంది.

    ఆడియోకు పిలిచినా రాలేదు

    ఆడియోకు పిలిచినా రాలేదు

    ‘రాజాధిరాజా' సినిమా ప్రమోషన్‌కి సహకరించలేదు. ఆడియో విడుదలకు రమ్మని పిలిచినా స్పందన లేదు. అతన్ని నమ్మి కోట్లు పెట్టి సినిమా తీసే నిర్మాతకి ఇచ్చే గౌరవం ఇదేనా?

    భాధ్యత లేదా

    భాధ్యత లేదా

    తను నటించిన సినిమాని ప్రమోట్‌ చేయడం శర్వానంద్ బాధ్యత కాదా? ఇప్పటికీ చెబుతున్నా శర్వానంద్‌ మంచి నటుడు. అయితే ఇటువంటి చర్యలు అతడి వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాయి.

    జోక్యం కలగచేసుకుని

    జోక్యం కలగచేసుకుని

    నిజానికి మొదట ఈ సినిమాకి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవ హరించారు. అయితే ట్రైలర్‌ నేనే కట్‌ చేస్తాను అంటూ నా పనిలో జోక్యం చేసుకునేవారు. ఒక దర్శకుడిగా నా క్రియేటివిటీని ఇంకొకరికి ఎలా ఇస్తాను.

    ప్రొడ్యూస్ చేయనన్నారు

    ప్రొడ్యూస్ చేయనన్నారు

    ఈ సినిమా నిర్మాణం చేయనన్నారు. దాంతో ఏడాది ఆగిపోయింది. తర్వాత ఎలాగో తంటాలు సినిమా పూర్తి చేశాను. నిర్మాత వెంకటేష్‌ ఈ సినిమా చూసి, బాగుందని హక్కులు తీసుకున్నారు.

    పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం

    పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం

    విడుదల సమయంలో ప్రమోషన్‌కి రమ్మని పిలిస్తే శర్వానంద్‌ అస్సలు స్పందించనే లేదు. రవి కిషోర్‌, శర్వానంద్‌లు పని గట్టుకుని ఈ సినిమాపై నెగిటివ్‌ ప్రచారం చేస్తు న్నారని తెలిసింది.

    భాధ అనిపించింది

    భాధ అనిపించింది

    ఒక మంచి సినిమాని, తెలుగు ఇండస్ర్టీకి కొత్తగా వస్తున్న ఒక దర్శకుడిని ప్రోత్సహించాల్సిన వారే ఇలా చేయడం బాధనిపించింది.

    తమ్ముడులా చూసా, తోడుగా

    తమ్ముడులా చూసా, తోడుగా

    శర్వానంద్‌ని సోదరుడిలా చూసుకున్నాను. మా అమ్మాయి సమస్యలో ఉన్నప్పుడు నాకు తోడుగా నిలిచాడు. అటువంటిది ఇలా మారిపోయాడు.

    సంభంధం లేదని చెప్పాడు

    సంభంధం లేదని చెప్పాడు

    25 మెసేజ్‌లు పంపించాను. దేనికీ సమాధానం లేదు. డబ్బులివ్వమని మేము ఎప్పు డూ చెప్పలేదు. సినిమాకి, నాకు సంబంధం లేదని చెప్పాడట. హక్కులు తీసుకున్న నిర్మాత ఎంతో కష్టపడి సినిమా విడుదల చేశాడు.

    హీరోయిన్ నిత్యా సైతం

    హీరోయిన్ నిత్యా సైతం

    హీరోయిన్‌ని ప్రమోషన్‌కి రమ్మని అడిగితే, హీరో వస్తే వస్తానని చెప్పింది. ఆమెని ఎంపిక చేసింది నిర్మాతా? లేక హీరోనా? ఇదేమి న్యాయం?

    బాగుందని అన్నారు

    బాగుందని అన్నారు

    సినిమా బాగుందని ఆంధ్రా నుంచి నలుగురైదుగురు ఫోన్ చేసి అభినందించారు. వారిలో పలువురు హీరోలు, దర్శకులు కూడా ఉన్నారు.

    ఎవరూ ఆపలేరు,ఫిర్యాదు చేయటం లేదు

    ఎవరూ ఆపలేరు,ఫిర్యాదు చేయటం లేదు

    మంచి సినిమాని ఎవరూ ఆపలేరు ‘రాజాధిరాజా' నిరూపించింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయాలనుకోవడం లేదు.

    కోరుకుంటున్నా

    కోరుకుంటున్నా

    తెలుగు ప్రేక్షకుల్ని ఒక్కటే కోరుకుంటున్నాను - ‘రాజాధిరాజా' మంచి సినిమా ఆదరించండి. పబ్లిసిటీ లేకుండా సక్సెస్‌ సాధించాం. హీరోహీరోయిన్లు సహకరిస్తే మరింత విజయం సాధించి ఉండేది' అని చేరన్ పేర్కొన్నారు.

    అభిరుచే కారణం

    అభిరుచే కారణం

    ఇక తెలుగు ప్రేక్షకులు సినిమాలో కొత్తదనాన్ని, మార్పు కోరుకుంటున్నారని, ‘బిచ్చగాడు', ‘రాజాధిరాజా' విజయాలకు వారి అభిరుచే కారణమని చేరన్ అన్నారు.

    అసలేం జరిగింది

    అసలేం జరిగింది

    శర్వానంద్ కు ఇవ్వాల్సిన మొత్తం క్లియర్ చేయకపోవటం వల్ల వచ్చిన కమ్యూనికేషన్ గ్యాపే ఈ వివాదానికి కారణం అంటున్నారు.

    టీమ్

    టీమ్

    శర్వానంద్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: జి.వి.ప్రకాష్ కుమార్, , కెమెరా: సిద్ధార్థ్, డైలాగ్స్: రమణ మాలెం, ఎడిటర్: జి.రామారావు, సాహిత్యం: అనంత్ శ్రీరాం, ఆర్ట్: రాజీవన్, జి.సెల్వకుమార్, సహ నిర్మాత: పి.శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.సాయికృష్ణ, నిర్మాత: ఎన్.వెంకటేష్, దర్శకత్వం: చేరన్.

    English summary
    Tamil director-producer Cheran has leveled some serious allegations against actor Sharwanand who is usually soft and maintains distance from controversies. Cheran alleged that Sharwa hasn't cooperated for the publicity of his film Rajadhi Raja that released last week after a lot of hurdles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X