ప్రస్థానం అందుకే ఆడలేదు.. అసలు కారణాన్ని బయటపెట్టిన డైరెక్టర్ దేవకట్టా!

ఒక సినిమా ఇండస్ట్రీలో ఏడాదికి వేల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటాయి. ఇక మరికొన్ని అంతగా క్లిక్కవ్వకపోయినా కంటెంట్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంటాయి. అందులో ప్రస్థానం సినిమా ఒకటి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్థానం మూవీకి ఒక ప్రత్యేక స్థానం లభించింది.

ప్రస్థానం వాళ్లకు ఇష్టమైన సినిమా..

ప్రస్థానం వాళ్లకు ఇష్టమైన సినిమా..

2010 విడుదలైన ప్రస్థానం సినిమా రిలీజ్ రోజే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా మంది సినీ ప్రముఖులు ఆ సినిమాను చూసి ఆశ్చర్యపోయారు. కంటెంట్ బాగా నచ్చడంతో ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకున్నారు. రాజమౌళికి ప్రస్థానం అంటే చాలా ఇష్టం. అందుకే బాహుబలి కథ విషయంలో కొన్ని సీన్లకు దేవకట్టా సహాయాన్ని తీసుకున్నారు.

అంతగా క్లిక్కవ్వలేకపోయింది..

అంతగా క్లిక్కవ్వలేకపోయింది..

ప్రస్థానం సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఆ సమయంలో డార్లింగ్, సింహా సినిమాలు రిలీజ్ కావడం కొంత ఈ సినిమాపై ఎఫెక్ట్ పడింది. కొన్ని ఏరియాల్లో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. అయితే కంటెంట్ పరంగా సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ లో సంజయ్ దత్ అదే పేరుతో ఇటీవల రీమేక్ చేశారు.

బాలీవుడ్ లో బిగ్ డిజాస్టర్..

బాలీవుడ్ లో బిగ్ డిజాస్టర్..

సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తరువాత ఎంతో ఇష్టపడి ప్రస్థానం కథను సెలెక్ట్ చేసుకున్నాడు. పోటీ పడి సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్న సంజయ్ ఆ సినిమాలో సాయి కుమార్ పాత్రలో నటించాడు. సొంత ప్రొడక్షన్ లోనే దేవకట్టతో సినిమాను నిర్మించిన మున్నా భాయ్ ఊహించని పరాజయాన్ని అందుకున్నాడు.

Recommended Video

'Prasthanam' Hindi Remake Trailer Is Out Now || Filmibeat Telugu
క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

హిందీలో ప్రస్థానం డిజాస్టర్ అవ్వడానికి గల అసలు కారణాన్నిన్ని బయటపెట్టాడు దర్శకుడు దేవకట్టా. సినిమా సరైన సమయంలో రిలీజ్ కాలేదని చెబుతూ.. కథలో కొన్ని మార్పులు చేయడం, అలాగే సంజయ్ దత్ క్రేజ్ కి అవి సెట్టవ్వలేదని అన్నారు. అలాగే ప్రమోషన్స్ కూడా సినిమాకు అనుకున్నంతగా చేయలేదని అందుకే హిందీలో ప్రస్థానం జనాలకు దగ్గరగా చేరలేకపోయిందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X