అవార్డుల కోసం లాబీ చేయలేదు అందుకే: 'ప్రస్థానం' దే్వకట్టా
ఈసారి జాతీయపురస్కారాల్లో 'ప్రస్థానం' చిత్రానికి గుర్తింపు దక్కుతుందనే అందరూ భావించారు.అయితే అలా జరగలేదు. దాంతో ఆ చిత్ర దర్శకుడు దేవా కట్టా కొంచెం ఘాటుగానే స్పందించారు.ఆయన ఈ విషయమై మాట్లాడుతూ ''మా సినిమాకు పురస్కారం రానందుకు నేనుగానీ, నా బృందంగానీ ఏమీ బాధపడటం లేదు. మేం మంచి స్థాయిలోనే చిత్రాన్ని తీశాం. ఇండియన్ పనోరమాలో ప్రదర్శించారు. అవార్డులకి పద్ధతి ప్రకారం పంపించాం. ఎక్కడా లాబీ చేయలేదు. అలా చేసి అవార్డులు తెచ్చుకొంటే ఏం తృప్తి ఉంటుంది. ఇక ముందు కూడా ఇంత బాగానే చిత్రాలు తీస్తాను'' అన్నారు. గోవాలో గతేడాది నిర్వహించిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన తెలుగు చిత్రం 'ప్రస్థానం'. దీన్ని ఇండియన్ పనోరమా విభాగంలో కూడా ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications











