YSR, CBN బయోపిక్: ఇది నా ఐడియా.. బడా నిర్మాత మోసం చేశారు.. ప్రస్థానం డైరెక్టర్ వార్నింగ్
ఒకసారి మోసపోయాను, ఇక తెలిసి తెలిసి మరోసారి మోసపోలేను అంటూ ప్రస్థానం దర్శకుడు దేవకట్టా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడటం అందరిని షాక్ కి గురి చేసింది. రీసెంట్ గా ట్విట్టర్ వేదికగా దేవకట్టా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన కథను ఒక బడా నిర్మాత మళ్ళీ కాపీ కొట్టారు అని, అయితే ఈ సారి వదిలేది లేదని లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ప్రస్థానం దర్శకుడు ట్వీట్ చేశాడు. ఆ విషయంపై ఆ నిర్మాత కూడా సమాధానం ఇచ్చారు.

YSR, CBN బయోపిక్
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాలేజి రోజుల్లో ఎంత మంచి మిత్రులొ అందరికి తెలిసిందే. కాంగ్రెస్ లో ఒకటిగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వారు ఆ తరువాత దాయదులుగా మారారు. అయితే వారి మధ్య ఉండే స్నేహంపై అప్పట్లో అనేక రకాల వార్తలు వచ్చేవి. ఇక ఆ పాయింట్ తో సినిమా చేయాలని దేవకట్టా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడట.

లీగల్ యాక్షన్ కి రెడీ..
2017లో ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన కథలను వివిధ వెర్షన్ లలో రిజిస్టర్ చేయించాను. హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ ఆధారంగా కథను రూపొందించడం జరిగింది. ఈ విషయం నిర్మాత విష్ణు ఇందూరికి కూడా తెలుసు. కానీ ఆయన మళ్ళీ ఇదే కథని వేరే రకంగా కాపీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్దమైనట్లు దేవకట్టా వివరణ ఇచ్చారు.

మరోసారి మోసపోలేను
గతంలో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కూడా ఇదే మోసం జరిగిందని చెప్పిన దేవకట్టా ఇదివరకే ఒకసారి మోసపోయాను ఇప్పుడు మరోసారి కూడా సైలెంట్ గా ఉండడం తప్పు అనిపిస్తోంది. యూఎస్ నుంచి మంచి జాబ్ వదిలేసుకొని వచ్చి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. నా ఐడియాలను కాపీ కొడుతుంటే నేను స్పంధించాల్సిన అవసరం ఉందని కూడా దేవకట్టా వివరణ ఇచ్చారు.
Recommended Video

స్పందించిన నిర్మాత
అయితే ఇదే విషయంపై నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి స్పందిస్తూ.. '2015లో ఒక రీమేక్ విషయంపై నేను సెలెక్ట్ చేసిన అంశంపై మొదటిసారి దేవకట్టతో మాట్లాడాను. అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన బయోపిక్ విషయంలో కూడా ఒక స్క్రీన్ ప్లే ప్లాన్ రెడీ చేసుకొని అతనికి చెప్పడం జరిగింది. ఆయనకు నా ఐడియా బాగా నచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ బయోపిక్ గురించి నాతో చెప్పింది లేదు' అని విష్ణు తెలియజేశారు


Click it and Unblock the Notifications











