తమిళలకే కాదు, తెలుగు వారికి కూడా ‘ఇంద్రసేన’ నచ్చుతుంది
‘ఇంద్రసేన’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడారు.తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు నచ్చేలా సినిమా ఉంటుందన్నారు.
Recommended Video

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన 'ఇంద్రసేన' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు జి శ్రీనివాసన్ మాట్లాడుతూ 'ఈ చిత్రం తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వాళ్లకు కూడా నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. ఈరోజు ఈ ఫంక్షన్ జరగటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా మా సినిమా పోస్టర్స్,హోర్డింగ్స్ చూస్తారు. నగరంలో ఎక్కడ చుసినా మా సినిమా పోస్టర్ ఉన్నాయి. అంత బాగా ప్రమోషన్స్ చేశారు. రెండు రోజుల్లో సినిమా మీ ముందుకి వస్తుంది. అందరూ తప్పకుండా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం' అని వ్యాఖ్యానించారు.
విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, సమర్పణ : నీలం లక్ష్మి, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.


Click it and Unblock the Notifications











