twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్స్ మీద దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు.. ఎవరైనా పడుకోవలసిందే.. వాళ్లకు కూడా తప్పదంటూ!

    |

    ఈ మధ్య కాలం లో ఫేడ్ అవుట్ అయిన దర్శకనిర్మాతలకు అలాగే సినీ నటులకు యూట్యూబ్ ఛానల్స్ ఒక వరంలా దొరికాయి. ఎప్పుడో ఒకటి రెండు సినిమాలు చేసిన వారిని కూడా సీనియర్ దర్శకుడు, సీనియర్ నిర్మాత అంటూ సంబోధిస్తూ వారితో గంటల గంటల ఇంటర్వ్యూలు చేస్తూ జనం నెత్తిన రుద్దే పరిస్థితి కనిపిస్తోంది. కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఎంతకైనా వారు వెనకాడడం లేదు. తాజాగా తెలుగులో రెండు మూడు సినిమాలు చేసి ఫేడవుట్ అయిపోయిన ఒక దర్శకుడు అలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లి తెలుగు హీరోయిన్స్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

    సంకీర్తన సినిమా ద్వారా

    సంకీర్తన సినిమా ద్వారా

    గీతాకృష్ణ అనే ఒక దర్శకుడు నాగార్జున హీరోగా వచ్చిన సంకీర్తన అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా ఒక్కటి కూడా సరిగ్గా ఆడలేదు. కోకిల, కీచురాళ్ళు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కాఫీ బార్ లాంటి అనేక సినిమాలు తెరకెక్కించిన ఆయనకు తెలుగు సినీ పరిశ్రమ కలిసి రాలేదని అనుకున్నారో ఏమో తెలియదు కానీ తమిళ సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడ కూడా రెండు సినిమాలు చేశారు.

    అసభ్యకరమైన వ్యాఖ్యలు

    అసభ్యకరమైన వ్యాఖ్యలు

    అయితే అవి కూడా ఆయనకు కలిసి రాకపోవడంతో ఈ మధ్య కాలంలోనే ఒక ఫిలిం స్కూల్ పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. సినీ పరిశ్రమ విషయమే కాక ప్రపంచంలో ఎలాంటి విషయం ఏదైనా తనదైన శైలిలో స్పందించి ఆయనతో ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.. అందులో భాగంగానే ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేయగా సదరు ఛానల్ లో ఆయన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ హీరోయిన్స్ గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

    పడుకోవాల్సిందే అంటూ

    పడుకోవాల్సిందే అంటూ

    మీరు ఉన్నప్పటికీ ఇప్పటి సినీ పరిశ్రమకు ఏమైనా మార్పులు కనిపించాయా? అని యాంకర్ అడిగితే అకారణంగా హీరోయిన్స్ వ్యవహారం లాగుతూ ఆయన హీరోయిన్స్ అప్పుడైనా పడుకోవాల్సిందే ఇప్పుడైనా పడుకోవాల్సిందే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ కాస్టింగ్ కోచ్ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. అప్పట్లోనే నిజంగా ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు అందరూ బయటకు వచ్చి తమ తమ గోడు వెళ్లబోసుకున్నారు.

    రేణుదేశాయ్ ఫోటో తీసుకుని

    రేణుదేశాయ్ ఫోటో తీసుకుని

    దీంతో సినీ పరిశ్రమలో అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక లేడీ ప్రొటెక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆయన మాత్రం తన వర్షన్ వినిపిస్తూ రేణుదేశాయ్ కి సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు అని చెప్పుకొచ్చాడు. తొలుత రేణుదేశాయ్ ఫోటో తీసుకుని ముంబై వెళితే ఆమె మీకు సరిపోదని కోఆర్డినేటర్లు చెప్పారని ఆయన అన్నారు.

    హనీట్రాప్ అంటూ

    హనీట్రాప్ అంటూ

    అసలు అలా సరిపోక పోవడం ఏమిటి అని ఆవిడకి ఫోన్ చేస్తే ఇలాంటి కాస్టింగ్ కౌచ్ అంశాలను తాను ఎంకరేజ్ చేయను కాబట్టి తల మీద వాళ్ళు అలాంటి కామెంట్ చేస్తారని రేణుదేశాయ్ చెప్పారని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాదు కాస్టింగ్ కోచ్ సహా హనీట్రాప్ కూడా ఉంటుందని కొన్ని సందర్భాలలో హీరోయిన్స్ ను కాస్టింగ్ కౌచ్ కోసం ఒప్పిస్తే మరికొన్ని సందర్భాల్లో తమకు మంచి ఆఫర్లు వస్తాయని తమకు తామే సమర్పించుకుంటారు అంటూ దానికి అర్థం వచ్చేలా హనీట్రాప్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ విషయం మీద అనేక రకాల కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

    English summary
    Director Geetha Krishna made Controversial Comments on heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X