క్రాక్ బాలీవుడ్ రీమేక్.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు.. అసలు క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు
జనాలు సినిమా థియేటర్లకు వస్తారా రారా అనే సందేహం భయాన్ని కలిగిస్తున్న సమయంలో క్రాక్ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. కరోనా కాదు కదా, మరేదోచ్చినా ఆడియెన్స్ ను ఎవరు అడ్డుకోలేరని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఏడాది అనంతరం బాక్సాఫీస్ కు నిజమైన ఊపు తెచ్చిపెట్టిన సినిమాను గోపిచంద్ మలినేని అందించాడు. ఈ స్థాయిలో హిట్టయితే బాలీవుడ్ లో రీమేక్ అవ్వకుండా ఉంటుందా.. అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇక దర్శకుడు అయితే ఇద్దరు హీరోలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

ఎన్నో అనుమానాల మధ్య విడుదలై..
నిజంగా సినిమా ఇండస్ట్రీలో క్రాక్ విజయాన్ని ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. లాక్ డౌన్ తరువాత ఎన్నో అనుమానాల మధ్య విడుదలైనప్పటికి కలెక్షన్స్ విషయంలో తేడా కొట్టలేదు. ఇక ప్రస్తుతం ఆ సినిమా డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి డిమాండ్ కూడా పెరిగింది. బడా ప్రొడక్షన్ హౌస్ ల నుంచి భారిగా ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించాలని అనుకుంటున్నారు.

అగ్ర హీరోల దృష్టి మొత్తం అతనిపైనే...
ఇండస్ట్రీలో అగ్ర హీరోల దృష్టి మొత్తం ఇప్పుడు గోపిచంద్ పైనే ఉంది. గత 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న ఈ దర్శకుడు అందరి హీరోలకు సుపరిచితమే. అయితే హిట్ టాక్ రాగానే మెగాస్టార్ నుంచి గోపిచంద్ పిలుపు అందుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య చాలా సేపు చర్చ జరిగింది. మెగాస్టార్ కూడా మంచి కథ ఉంటే చూడమని అప్పుడే చెప్పారట.

అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ
ఇక గోపిచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నుంచి అడ్వాన్స్ కూడా అందినట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో సినిమా చేయడానికి చర్చకు జరుగుతున్నట్లు గోపీచంద్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఆ సినిమా అనంతరం తమకు సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

క్రాక్ రీమేక్ లో ఆ ఇద్దరిలో ఒకరు ఫిక్స్
ఇక బాలీవుడ్ లో కూడా క్రాక్ సినిమాను రీమేక్ చేయమని ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. బాలయ్యతో సినిమా అయ్యాక బాలీవుడ్ క్రాక్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో ఎవరనే విషయంలో ఇటీవల దర్శకుడు ఒక క్లారిటి అయితే ఇచ్చాడు. ముందుగా బాలీవుడ్ సింగం అజయ్ దేవ గన్ ను అనుకున్నట్లు చెప్పిన గోపిచంద్ అనంతరం అతను కాకపోతే రణ్ వీర్ సింగ్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు చెప్పాడు. ఇద్దరు హీరోలు కూడా ఇదివరకే పోలీస్ గెటప్స్ తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకున్నవారే. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని తప్పితే మరే హీరోను అనుకోవడం లేదని కూడా గోపిచంద్ మలినేని వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











