సమంత పాన్ ఇండియా మూవీ.. VFX హై లెవెల్లో ఉండేలా దర్శకుడి ప్లానింగ్!
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ మొదటి నుంచి కమర్షియల్ ఫార్మట్ లోనే కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఎలాంటి సినిమా చేసినా కూడా తన మార్క్ టాలెంట్ ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా ఆయన మేకింగ్ విజన్ చాలా విభిన్నంగా ఉంటుందని ఒక్కడు, అర్జున్ వంటి సినిమాలతోనే అర్ధమయ్యింది.
హాట్ బికినీ ఫోజులతో రెచ్చగొడుతోన్న బాలీవుడ్ బ్యూటీ
ఇక ఆ మధ్య అనుష్కతో రుద్రమదేవి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత రేంజ్ కో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ఈ స్టార్ డైరెక్టర్ తన విజన్ ను మరువకుండా మళ్ళీ అంతకు మించి అనేలా శాకుంతలం సినిమాతో రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఆ ప్రాజెక్ట్ లో సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక VFX విషయంలో దర్శకుడు ఎ మాత్రం తగ్గడం లేదట. ఇప్పటికే సినిమాకు 35కోట్లకు పైగా ఖర్చు చేస్తుండగా అందులో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ కు ఖర్చవుతొందట. ఇక మేకింగ్ విషయంలో ఏ మాత్రం రాజీపడని గుణశేఖర్ ఈసారి మళ్ళీ బడ్జెట్ ఎక్కువైనా పరవాలేదని వర్క్ చేయిస్తున్నాడట. సమంత కూడా నెవర్ బిఫోర్ అనే పాత్రలో నటిస్తోంది కాబట్టి సినిమాకు ఆమెనే స్పెషల్ ఎట్రాక్షన్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో దిల్ రాజు కూడా గుణశేఖర్ నిర్మాణంలో భాగస్వామిగా చేరాడు. దీంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











