సమంత పాన్ ఇండియా షూటింగ్ లో కోవిడ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ 19 సెకండ్ వేవ్ భారీ స్థాయిలో వ్యాపిస్తోంది. రెగ్యులర్ లైఫ్ లో కామన్ గా మారిందని అనుకున్నప్పటికి కోవిడ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీని కూడా ఈ వైరస్ భారీ స్థాయిలో దెబ్బ కొడుతోంది. సినిమాలు చాలా వరకు వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది.
కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే కోవిడ్ భారిన పడి క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇక దర్శకుడు గుణశేఖర్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ శాకుంతలం షూటింగ్ పనులకు కూడా బ్రేక్ పడినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ కథనాలపై స్పందించిన గుణశేఖర్ అవన్నీ అబద్దాలని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎప్పటిలానే షూటింగ్ లో రెగ్యులర్ కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయని అయితే తాను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రాలేదని, డాక్టర్లు కూడా నిర్దారించినట్లు గుణశేఖర్ పేర్కొన్నారు. ఇక షూటింగ్ పనులు తగిన జాగ్రత్తలతో యధావిధిగా కొనసాగుతాయని గుణశేఖర్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











