For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Neelima Guna: డైరెక్టర్ గుణ శేఖర్ కుమార్తె నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే?

  |

  గుణ శేఖర్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లో ఆయన ఒకరు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక్కడు మూవీ తెరకెక్కించి ఎంత పెద్ద హిట్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కడు మూవీ మహేశ్ బాబు కెరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత అనేక సినిమాలను తెరకెక్కించిన అంతగా పేరు రాలేదు. ఇటీవల రుద్రమదేవితో వచ్చిన గుణ శేఖర్ తాజాగా శాకుంతలం సినిమాతో స్టార్ హీరోయిన్ సమంతను డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఆయన కుమార్తే నీలిమ గుణ సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారారు. త్వరలో ఆమె పెళ్లిపీటలు ఎక్కనుంది. తాజాగా ఆమె ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

  ఎప్పటికీ నిలిచి ఉండే కొత్త బంధం..

  టాలీవుడ్ ప్రముక దర్శకుడు గుణ శేఖర్ మొదటి కుమార్తె నీలిమ గుణ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా అక్టోబర్ 8 శనివారం రోజున ఆమె నిశ్చితార్థపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు చాలా మంది హాజరైనట్లు సమాచారం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది నీలిమ గుణ. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ఎప్పటికీ నిలిచి ఉండే కొత్త బంధాన్ని ప్రారంభిస్తున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిర్మాత అయిన నీలిమ గుణ రవి ప్రఖ్యా అనే వ్యక్తిని పెళ్లాడనుంది. అలాగే డైరెక్టర్ గుణ శేఖర్ ఈరోజు తమకు స్పెషల్ డే అని రాసుకొస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

  రుద్రమ దేవి చిత్రానికి సహా నిర్మాతగా..

  రుద్రమ దేవి చిత్రానికి సహా నిర్మాతగా..

  అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో నీలిమ గుణ నిర్మాతగా మారారు. తండ్రి గుణ శేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమ దేవి చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న శాకుంతలం మూవీని నీలిమ గుణ నిర్మించారు. కాగా ఈ మూవీని మొదటగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇటీవల ఈ చిత్రాన్ని అనుకున్నట్లుగా నవంబర్ 4న విడుదల చేయలేకపోతున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ''నవంబర్ 4 నాటికి ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కావడం లేదు. అలాగే ఈ మూవీని 3D ఫార్మాట్ లో విడుదల చేయనున్నాం. అందుకే 3D పనులకు మరికొంత సమయం అవసరం ఉంది. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించాం. మరో కొత్త తేదిని త్వరలో ప్రకటిస్తాం'' అని అధికారికంగా అనౌన్స్ చేశారు.

  ఇలా జరుగుతుందని ఊహించలేదు..

  ఇలా జరుగుతుందని ఊహించలేదు..

  దీంతో సమంత అభిమానులకు మూవీ వాయిదా పడటం బ్యాడ్ న్యూసో.. చిత్రం 3Dలో రావడం గుడ్ న్యూసో తెలియడం కష్టంగా ఉంది. అలాగే ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ఊహించలేదు. ఇక ఈ మూవీలో సమంత మొదటిసారిగా పౌరాణిక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా యాక్ట్ చేశాడు. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ లో గుర్రపు స్వారీ చేస్తున్న రాజుగా, మనోహరంగా ఉన్నాడు దేవ్ మోహన్. అలాగే మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను దిల్ రాజు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సమంత, దేవ్ మోహన్ చాలా రొమాంటిక్ గా కనిపించారు.

  పాన్ ఇండియా చిత్రంగా..

  పాన్ ఇండియా చిత్రంగా..

  ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో మెరవనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ శాకుంతలం చిత్రంలో చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ మూవీతోనే అల్లు అర్హ చిత్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా ఈ మూవీని విడుదల చేయనున్నారు.

  English summary
  Tollywood Top Director Gunasekhar Daughter And Samantha Starrer Shakuntalam Movie Producer Neelima Guna Engagement With Ravi Prakhya Photos Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X