For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాబు గారూ..! బాలయ్య సినిమాకు రాయితీలిచ్చారు, నా సంగతేమిటి???: సంచలనం రేపుతున్న గుణశేఖర్ లేఖ

  |

  గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చేసాయి. చారిత్ర వీరుడు గౌతమీ పుత్ర శాతకర్ణి పై క్రిష్ తీసిన ఈ సినిమాలో బాలయ్య బాబు నటించిన సంగతి తెలిసిదే.. చరిత్రని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి... సినిమాకి పన్ను రాయితీ ప్రకటించాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.

  గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర తెలంగాణా తో ముడి పడి ఉండటం వల్ల ఇక్కడా... తెలుగు సంస్కృతి లోనే ఉన్నతమైన స్థానం కలిగిన రాజు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ పన్ను రాయితీ కల్పించింది. అంత వరకూ బాగానే ఉంది కానీ మరి నా సినిమాకి ఇస్తాం అని చెప్పి ఎగ్గొట్టిన రాయితీ సొమ్ము మాట ఏమిటీ అంటూ దర్శకుడు గుణ శేఖర్ రాసిన లేఖ సంచలమైంది... ఇంతకీ ఏం జరిగిందీ గుణశేఖర్ ఏం రాసాడూ అంటే....

  పన్ను రాయితీ:

  పన్ను రాయితీ:

  చారిత్రక చలనచిత్రంగా రూపొందించిన గౌతమిపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను రాయితీని ప్రకటించి.. కళలపట్ల, సంస్కృతి పట్ల మీరు చూపే ఆదరాభిమానాలకు సాటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2015 అక్టోబరు 9న

  మూడు దశాబ్దాల తర్వాత :

  ప్రపంచవ్యాప్తంగా నాలుగు (తెలుగు, తమిళం, హిందీ, మలయాళం) భాషల్లో నా దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని విడుదల చేశాం. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగులో వచ్చిన చారిత్రక చిత్రం కావడంతో.. గతంలోనే వినోదపు పన్ను రాయితీ కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాం.

  శతవిధాలా ప్రయత్నించినా:

  శతవిధాలా ప్రయత్నించినా:

  ముందుగా సానుకూలంగానే స్పందించిన అధికారులు పనుల్లో కొంత పురోగతిని చూపించి (నా విన్నపం మేరకు కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు) అర్ధాంతరంగా ఫైలును మూసివేశామంటూ చెప్పారు. ఆ తర్వాత మిమ్మల్ని గానీ, అధికారులను గానీ కలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు.

  ఎన్నో వ్యయప్రయాసలకోర్చి :

  ఎన్నో వ్యయప్రయాసలకోర్చి :

  పురుషాధిక్య సమాజంలో 13వ శతాబ్దంలోనే స్త్రీ సాధికారతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన కాకతీయ మహా సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి చరిత్రను.. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ పురుషాధిక్య సమాజంలో (భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదని భావిస్తున్నా) ఆదర్శవంతమైన స్త్రీ మూర్తి జీవితగాథగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించాం.

  ఎందరో సినీ ప్రముఖులు:

  ఎందరో సినీ ప్రముఖులు:

  అంతేగాకుండా భారతదేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటి స్టీరియో స్కోపిక్ త్రీడీ చిత్రంగా అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను తీశాం. ఈ మహత్కార్యంలో ఎందరో సినీ ప్రముఖులు నాకు అండగా నిలిచారు. సినిమా విడుదల సందర్భంలో ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ వినోదపు పన్ను మినహాయింపును కోరుతూ దరఖాస్తు చేసుకున్నాం.

  రాణి రుద్రమదేవి:

  రాణి రుద్రమదేవి:

  దానికి తక్షణమే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాయితీని కల్పించారు. నేనాశించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించి ఉంటే నిర్మాతగా నాకు కొంత ఉపశమనం కలిగి ఉండేది. రాణి రుద్రమదేవి కేవలం ‘తెలంగాణ'కే చెందిన వ్యక్తే కాదని,

  పున:పరిశీలించి:

  పున:పరిశీలించి:

  దాదాపు దక్షిణాపథమంతటినీ పాలించిన మహారాణి అని ఆమె పట్టాభిషేకం సందర్భంగా అమరావతిలోని మంగళగిరి వద్దగల మార్కాపురం శాసనాన్ని మీరు ఇటీవల ఒక సభలో ఉదహరించారు. ఈ నేపథ్యంలో నా దరఖాస్తును పున:పరిశీలించి ఇప్పటికే రుద్రమదేవి చిత్రానికి

  పారదర్శకంగా:

  పారదర్శకంగా:

  ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు'ను అందజేసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేస్తుందని ఇదివరకు రుజువు చేసినట్లుగానే మరోమారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. అంటూ తన లేఖని ముగించాడు గుణశేఖర్.

  గౌతమీ పుత్రుడి కథే కాదు:

  గౌతమీ పుత్రుడి కథే కాదు:

  అయితే ఇప్పటి వరకూ ఈ విషయం పై ఎవరూ స్పందించలేదు కాగా అసలు గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో చాలా లోపాలున్నాయనీ అది అసలు గౌతమీ పుత్రుడి కథే కాదంటూ ఒక పత్రికలో వచ్చిన మరో కథనం కూడా బాలకృష్ణ సినిమా మీద కాస్త ప్రభావం చూపేలాగానే ఉంది.

  English summary
  Ace director Gunasekhar wrote a sensational letter to Andhra Pradesh Chief Minister. This open letter turned as a sensation in two Telugu speaking states and in Telugu film industry as well.He has written this letter in the wake of entertainment tax got waived for Balakrishna’s Gautamiputra Satakarni.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X