twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను క్షమించండి, అసలు మనం ఏ దేశంలో ఉన్నాం..?: గుణశేఖర్ ఆవేదన

    |

    2014 - 2015 - 2016 సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. అసలు చాలామందిని డిజప్పాయింట్ చేసింది. ఒక ప్రక్కన ఈ అవార్డులన్నీ బాలకృష్ణకు కట్టపెట్టారంటూ కొందరు.. అల్లు అర్జున్ ను కావాలనే తొక్కేశారంటూ కొందరూ.. అలాగే రుద్రమదేవికి అన్యాయం చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఇలా కామెంట్ చేస్తే మాత్రం మూడేళ్ళు బ్యాన్ చేస్తాం అంటూ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే వార్నింగ్ ఇస్తోందని ఇప్పుడు దర్శకుడు గుణశేఖర్ ఆరోపిస్తున్నాడు.

     దర్శకుడు గుణశేఖర్

    దర్శకుడు గుణశేఖర్

    టాలీవుడ్ లో ది బెస్ట్ అనదగ్గ మూవీస్ లో ఒకటిగా గుర్తింపు పొందిన చిత్రం రుద్రమదేవి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అయినా.. దర్శకుడు గుణశేఖర్ తనే నిర్మాతగా వ్యవహరిస్తూ.. భారీ బడ్జెట్ తో రూపొందించి.. చివరకు సేఫ్ అయ్యాడు. కానీ రీసెంట్ గా ప్రకటించిన నంది అవార్డులను పరిశీలిస్తే.. అసలు రుద్రమదేవిని పట్టించుకున్నట్లుగా కూడా అనిపించదు.

     ఉత్తమ నటి అవార్డు

    ఉత్తమ నటి అవార్డు

    అదే ఏడాది బాహుబలి ది బిగినింగ్ విడుదల కావడంతో.. ఉత్తమ చిత్రం అవార్డు ఆ మూవీకి ఇచ్చారు. మిగిలిన అవార్డులను శ్రీమంతుడు.. ఎవడే సుబ్రమణ్యం.. నేను శైలజ వంటి చిత్రాలు ఎగరేసుకు పోయాయి. ఉత్తమ నటి అవార్డును రుద్రమదేవిగా నటించిన అనుష్కకే ఇచ్చినా.. రుద్రమదేవి చిత్రానికి కాకుండా సైజ్ జీరో మూవీకి ఇచ్చారు.

    ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్

    ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్

    ఇక గోన గన్నారెడ్డిగా మెప్పించిన అల్లు అర్జున్ కు ఉత్తమ సహాయ నటుడు కాకుండా.. ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ అవార్డ్ ప్రకటించడం ఆశ్చర్యకరం. అయితే.. ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందంటూ సోషల్ మీడియాలో జనాలు ఎద్దేవా చేస్తున్నారు. జ్యూరీ మెంబర్ గా బాలయ్య ప్రమేయం ఉందన్నదే వీరందరి అభిప్రాయం.

    బాలయ్య చేతుల మీదుగా అవార్డు

    బాలయ్య చేతుల మీదుగా అవార్డు

    బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను రాయితీ ఇచ్చి..తమ సినిమాకు ఇవ్వకపోవడాన్ని గుణశేఖర్ బాహాటంగా తప్పుపట్టడం ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేయడానికి కారణం అని.. అందుకే గుణశేఖర్ ను ఇలా టార్గెట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరో సందర్భంలో బాలయ్య చేతుల మీదుగా అవార్డు తీసుకున్న గుణశేఖర్.. ఆయనను పట్టించుకోనట్లు ప్రవర్తించడం కూడా ఓ రీజన్ కావొచ్చని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.

     గౌతమీపుత్ర శాతకర్ణి

    గౌతమీపుత్ర శాతకర్ణి

    ఏపీ సీఎం చంద్రబాబు రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను ఎందుకు మినహాయింపు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా..? అని ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. మరో చారిత్రాత్మక చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి"కి మినహాయింపు ఇచ్చి తన చిత్రానికి ఎందుకివ్వలేదని గతంలో ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే.

     రుద్రమదేవికి చోటు దక్కలేదు

    రుద్రమదేవికి చోటు దక్కలేదు

    తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో రుద్రమదేవికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో గుణశేఖర్ ట్విట్టర్ ద్వారా "ఇప్పుడు ప్రకటించిన 2014, 15,16, సంవత్సరాల అవార్డుల విషయంలో ఎవరు ప్రశ్నించినా వాళ్లని మూడేళ్లపాటు అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తారట.!.

    అసలు మనం ఏ దేశంలో ఉన్నాం..?

    అసలు మనం ఏ దేశంలో ఉన్నాం..?

    అసలు మనం ఏ దేశంలో ఉన్నాం..? స్వతంత్ర భారతంలోనేనా..? మహిళా సాధికారతని చాటి చెబుతూ తీసిన "రుద్రమదేవి" ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎంపిక కాలేకపోయింది..? కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయింది...? మర్చిపోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి సినిమా తీసి గుర్తు చేశాడు.

     నన్ను క్షమించండి?

    నన్ను క్షమించండి?

    మళ్లీ ఇప్పుడు అవార్డులిచ్చి గుర్తు చేయడం ఎందుకనుకున్నారా..?. ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారా..?. అదే అయితే "రుద్రమదేవి" లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి" అని గుణశేఖర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫేస్ బుక్ లో విపరీతంగా షేర్ అవుతోంది .

    రాకపోతే సైలెంట్ గా ఉండండి

    రాకపోతే సైలెంట్ గా ఉండండి

    ఇదంతా చూస్తుంటే.. తెలుగు దేశం ప్రభుత్వం ఏ రేంజులో జనాలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉందో చెప్పకనే చెబుతోంది. ఇచ్చింది తీసుకోండి.. అవార్డు రాకపోతే సైలెంట్ గా ఉండండి.. కాని ప్రశ్నించకండి.. అన్నట్లుంది ప్రభుత్వం తీరు అని కొందరు అంటున్నారు ..

    English summary
    Gunasekhar came down heavily on AP Government for not giving due prominence to 'Rudramadevi' in the Nandi Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X