Hiranyakashyap: గుణశేఖర్‌కు హ్యాండ్ ఇచ్చిన రానా.. త్రివిక్రమ్ ఎంట్రీతో అలా! హిరణ్యకశ్యప చిచ్చు?
గుణ శేఖర్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక్కడు మూవీ తెరకెక్కించి ఎంత పెద్ద హిట్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కడు మూవీ మహేశ్ బాబు కెరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ తర్వాత అనేక సినిమాలను తెరకెక్కించిన గుణ శేఖర్ కు అంతగా పేరు రాలేదు. ఇటీవల శాకుంతలం సినిమాతో ఘోరమైన పరాజయం చవిచూశారు. అయితే తర్వాతి సినిమా కోసం ఎంతో కష్టపడిన గుణ శేఖర్ కు పెద్ద ఝలక్ తగినట్లు వార్తలు వస్తున్నాయి.

స్క్రీన్ ప్లే-డైలాగ్స్: బాహుబలి సినిమా సిరీస్ తర్వాత దగ్గుబాటి రానా పలు వెబ్ సిరీలు, సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే రానా దగ్గుబాటి తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ హిరణ్యకశిప. ప్రముఖ కామిక్ స్టోరీ అమర్ చిత్ర కథ స్ఫూర్తితో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇటీవల శాన్ డియాగో కామిక్ కాన్ వేదికపై రానా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారని కూడా వెల్లడించారు.

టార్గెట్: చాళక్య సామ్రాజ్యంపై తెరకెక్కుతున్న హిరణ్యకశ్యపను, త్రివిక్రమ్, రానాలను ఉద్దేశిస్తూ డైరెక్టర్ గుణ శేఖర్ ఓ ట్వీట్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఎక్కువగా రానా, త్రివిక్రమ్ ను టార్గెట్ చేసినట్లుగా టాక్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తావించకుండా: "దేవుడిని ఇతివృత్తంగా తీసుకుని కథను రాస్తున్నప్పుడు.. మనం చేసే పనులన్నింటినీ ఆ దేవుడు గమనిస్తూనే ఉంటాడని మనం గుర్తు పెట్టుకోవాలి. అనైతిక పనులకు ఆ దేవుడే నైతికంగా సమాధానం చెబుతాడు" అంటూ గుణ శేఖర్ తన ట్వీటులో రాసుకొచ్చారు. అయితే ఇందులో త్రివిక్రమ్, రానా పేర్లను ప్రస్తావించలేదు కానీ, ఆ మాటలు వారిని ఉద్దేశించే అన్నారని చర్చ నడుస్తోంది.

చెప్పకుండా: అయితే ఈ హిరణ్యకశ్యప అనే సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా గుణ శేఖర్ అప్పట్లో ఓసారి చెప్పుకొచ్చారు. దానికోసం సుమారు 6 సంవత్సరాలు కష్టపడ్డారట. కథ పూర్తి అయ్యాక త్రివిక్రమే స్వయంగా గుణ శేఖర్ ను కలిసి తాను డైలాగ్స్ అందిస్తానని చెప్పినట్లుగా ఓసారి గుణ శేఖర్ తెలిపారట. కానీ, ఇటీవల గుణశేఖర్ పేరు ఎత్తకుండా సినిమా గురించి రానా, త్రివిక్రమ్ అనౌన్స్ చేసేసరికి ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
హ్యాండిల్ చేయలేరేమో: ఇదిలా ఉంటే హిరణ్యకశ్యప కోసం కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేశారట గుణ శేఖర్. మధ్యలో కరోనా వచ్చి ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిందట. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో మళ్లీ సమయం అనుకూలించినప్పుడు హిరణ్యకశ్యపను పట్టాలెక్కిద్దాం అనుకున్నాడట గుణ శేఖర్. కానీ, మధ్యలో శాకుతలం తీసి చేతులు కాల్చుకున్నాడు ఈ డైరెక్టర్. దాని ప్రభావమే గుణ శేఖర్ పై పడి రానా, త్రివిక్రమ్ అలా చేశారని టాక్.


Click it and Unblock the Notifications











