మళ్ళీ అలాంటి ఎనర్జీని చూస్తారు.. పవన్ కళ్యాణ్ పై హరీష్ శంకర్ వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడైనా సరే మాస్ ఎలిమెంట్స్ హై రేంజ్ లో ఉండాలని అనుకుంటారు. పవన్ ఎనర్జీకి తగ్గట్లుగా హై వోల్టేజ్ సీన్స్ క్రియేట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద వాతావరణం మామూలుగా ఉండదు. ఇక అభిమానులకు నచ్చే డైలాగ్స్ ఉంటే సినిమా ఆల్ మోస్ట్ హిట్టయినట్లే. ఆ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ కాంబో అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన హరీష్ శంకర్ మరోసారి పవర్ స్టార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, హరీష్ శంకట్ అనగానే మొదటి నుంచి కూడా అభిమానుల్లో అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. తప్పకుండా మరొక సెన్సేషన్ క్రియేట్ చేయడం కాయమని అంటున్నారు. ఇక హరీష్ శంకర్ కూడా సినిమాను మంచి సందేశంతో పాటు అభిమానులకు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా గట్టిగానే మిక్స్ చేయబోతున్నాడట.

ముఖ్యంగా సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంటాయో ముందుగానే ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చాడు. అందులో పవన్ హిట్ మూవీ బద్రికి సంబంధించిన డైలాగ్స్ ఉండడంతో మళ్ళీ అదే ఎనర్జితో రాబోతున్నట్లు వివరణ ఇచ్చారు. చూస్తుంటే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కంటే హై రేంజ్ లో హిట్టు కొట్టవచ్చని టాక్ వస్తోంది. ఇక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకుంటున్నట్లు టక్. స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకున్న హరీష్ మరికొన్ని నెలల్లో సినిమాను సెట్స్ పైకి తేవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











