రవితేజ ‘నిప్పు’తో నటుడిగా మారిన దర్శకుడు
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నిప్పు. ఈ సినిమాలో దర్శకుడు హారిష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించ బోతున్నారు. హారిష్ శంకర్ ఇంతముందుకు రవితేజ హీరోగా వచ్చిన 'మిరపకాయ్" చిత్రానికి దర్శకత్వం వహించారు. వాస్తవానికి హారిష్ శంకర్ తో నటింప చేయాలయాలని దర్శకుడు గుణ శేఖర్ ముందుగా ఎలాంటి ప్రణాళికలు తయారు చేసుకోలేదు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ప్రసాద్ మల్టి ప్లెక్స్ లో నిప్పు షూటింగ్ జరుగుతుండగా అక్కడి వెళ్లిన హారిష్ శంకర్ అతిథి పాత్రలో నటింప చేశాడట గుణశేఖర్. అనంతరం తాను పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్" సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడు వెళ్లి పోయారు.
నిప్పు సినిమాలో రవితేజ సరసన దీక్షసేథ్ లీడ్ రోల్ చేస్తోంది. బొమ్మరిల్లు బ్యానర్ పై వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











