twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #justiceforchitra అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ శంకర్.. సజ్జనార్ వచ్చినా ఆగవు అంటూ ఆవేదన

    |

    భాగ్యనగరం నడిబొడ్డున ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యం సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేస్తున్నది. ఈ దారుణ ఘటనపై సాధారణ ప్రజలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తూ భావోద్వేగానికి గురి అవుతున్నారు. ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మనోజ్ మంచు, మహేష్ బాబు లాంటి , ఇతర ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియాలో తమ విచారం వ్యక్తం చేస్తూ #justiceforchitra అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం దర్శకుడు హరీష్ శంకర్ మానవత్వంతో వ్యవహరించాలని నెటిజన్లకు సూచిస్తున్నారు. ఈ హరీష్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భారీగా స్పందించారు. దర్శకుడు హరీష్ శంకర్ చైత్ర సంఘటనపై చేసిన ట్వీట్ ఏమిటంటే..

     సింగరేణి కాలనీలో దారుణం

    సింగరేణి కాలనీలో దారుణం

    హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్రపై ఓ నరరూప రాక్షసుడు దారుణానికి ఒడిగట్టారు. చిన్నారిపై మానభంగానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే.. పాప బతికి ఉండేదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

    మానవత్వం చనిపోయిందంటూ

    మానవత్వం చనిపోయిందంటూ

    చైత్ర ఘటనపై తీవ్రంగా స్పందించిన ఓ నెటిజన్.. చైత్ర ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. చైత్ర చనిపోలేదు. మానవత్వం మంట కలిసింది అంటూ నెటిజన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన ట్వీట్‌ను తెలంగాణ సీఎంవో, తెలంగాణ పీసీసీ, హరీష్‌ శంకర్‌కు, కేటీఆర్‌కు ట్వీట్ చేసి న్యాయం చేయాలని సూచించారు.

     హరీష్ శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తూ..

    హరీష్ శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తూ..

    అయితే నెటిజన్లు చైత్ర ఫోటోను ట్వీట్ చేయడంపై దర్శకుడు హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైత్ర ఫోటోను దయచేసి ట్వీట్ చేయవద్దు. సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దు. కావాలంటే చైత్రకు న్యాయం చేయడానికి మరో రకంగా పోరాటం చేద్దాం. కానీ దయ చేసి ఫోటోను షేర్ చేయకండి అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

     వకీల్ సాబ్ మూవీలో చెప్పినట్టు

    వకీల్ సాబ్ మూవీలో చెప్పినట్టు

    అయితే హరీష్ శంకర్ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ... వకీల్ సాబ్ మూవీలో పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టు ట్విట్టర్‌,ఫేస్‌బుక్‌లో రోడ్ల మీద ధర్నాలు, కొవ్వొత్తులు వెలిగించి రెండు రోజులు హడావిడి చేస్తారు ,ఆ తర్వాత అంత మాములే.. ఇలాంటి కేసుల్లో ఎక్కడన్నా న్యాయం జరుగుతున్నదా? అని నెటిజన్ ప్రశ్నించారు. వీటిని ఆపాలంటే మీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్లే ఆలోచించి చెప్పాలి హరీష్ గారు అంటూ కామెంట్ చేశారు.

    Recommended Video

    VJ Chitra : VJ చిత్ర మృతి కేసులో ట్విస్ట్.. భర్త అరెస్ట్.. కారణం ఇదే!!
     లిక్కర్ తాగిన వాడే ఇలాంటి దారుణాలకు..

    లిక్కర్ తాగిన వాడే ఇలాంటి దారుణాలకు..

    సమాజంలో ఇలాంటి సంఘటనలు సజ్జనార్ లాంటి ఆఫీసర్లు వచ్చినా ఆగవు. స్పాట్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఎమైనా ఆగాయా? ఆగలేదు కాదు కదా ఇంకా పెరిగాయి ఎందుకని? కారణం ఎవరు? ఎందుకు ఆపలేకపోతున్నారు? స్పృహలో ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి పనిచేయాలంటే కొంచెం భయపడతాడేమో కానీ హరీష్ గారు,లిక్కర్ తాగినవాడే ఇలాంటి ఘోరమైనపనులు చేసేది అని అభిప్రాయం అని సదరు నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Director Harish Shankar reacted heavily on Chitra Rape incident. He twetted that, please stop posting Chaitra pictures. We can fight this otherwise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X