బాహుబలి, RRR డబ్బింగ్ సినిమాలా? తెలుగు సినిమాను తక్కువ చేస్తావా? దర్శకుడు హరీష్ శంకర్ ఫైర్
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీ గురించి మీడియా ప్రతినిధుల అడిగే ప్రశ్నలు కాస్తా శృతి మించుతున్నాయానే చెప్పాలి. ఏదో ఒక కాంట్రవర్సీ ప్రశ్న అడిగి సోషల్ మీడియాలో నిలవాలనే తాపత్రయం కొందరు మీడియా ప్రతినిధుల్లో కనిపిస్తోంది. అలాంటి వారిలో సురేష్ కొండేటి ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆయన సినీ నటులను అడిగే ప్రశ్నలు కాస్తా ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. తాజాగా '2018' అనే డబ్బింగ్ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా సురేష్ కొండేటి ఇలాంటి ప్రశ్నలే అడగడం జరిగింది. దీనిపై స్పందించిన దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారిగా సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివారాల్లోకి వెళ్తే..
హీరోయిన్ ఒంటి మీద పుట్టమచ్చల గోల:
2022లో వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో..ఈ సినిమా విడుదల సమయంలో సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న కూడా అదే విధంగా సంచలనం రేపింది. హీరోయిన్ ఒంటి మీద ఎన్ని పుట్ట మచ్చలున్నాయో తెలుసా అంటూ మీడియా సమావేశంలోనే హీరో సిద్దు జోన్నలగడ్డను సురేష్ కొండేటి ప్రశ్నించారు. ఊహించని ప్రశ్నతో హీరో సిద్దు షాక్ అయ్యారు.ఈ ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఆ సమయంలో స్టేజీ మీద ఉన్న హీరోయిన్ నేహా శెట్టి సైతం కొంత ఇబ్బందికి గురైయ్యారు.

సురేష్ కొండేటిపై కేఎస్ రామారావు ఫైర్:
సీనియర్ నిర్మాత కేఎస్ రమారావు సైతం సురేష్ కొండేటి వ్యవహారశైలిపై మండిపడ్దారు.RRR సినిమా అస్కార్ అవార్డు గెలిచినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు స్పందించిన తీరు బాలేదని నిర్మాత కేఎస్ రమారావు అభిప్రాయపడుతూ ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే రెండు తెలుగు ప్రభుత్వాలు RRR టీంను సత్కరించాలని ఆయన కోరారు. ఆ సమయంలో సురేష్ కొండేటి, RRR టీంను సత్కరిస్తే మీరు వెళ్తారా అంటూ కేఎస్ రమారావును ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు చిర్రెక్కిన ఆయన సురేష్ కొండేటిపై ఫైర్ అయ్యారు. నేను వెళ్తే నీకేంటీ ..? వెళ్లకపోతే నీకేంటీ అంటూ సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాంటి వాళ్ల వల్లే నేను మీడియా సమావేశాలు పెట్టడం కూడా మానేశాను అంటూ ఒకింత ఆవేదన కూడా వ్యక్తం చేశారు.

విరుపాక్ష అలాంటి సినిమా అంటూ కామెంట్:
రీసెంట్ సూపర్ హిట్ 'విరూపాక్ష' సినిమా విడుదల సమయంలో కూడా సురేష్ కొండేటి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారు. విరూపాక్ష సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో అలాంటి సీన్లు ఏమైనా ఉన్నాయా అంటూ హీరో సాయిధరమ్ తేజ్‌ను ప్రశ్నించారాయన. దీనికి చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ కలుగజేసుకుని 'మగధీర' సినిమాకు కూడా A సర్టిఫికేట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక దీనికి సాయిధరమ్ తేజ్ సమాధానం ఇస్తూ.. మీకు కావాల్సిన సీన్లు ఈ సినిమాలో లేవని చెప్పి సురేష్ కొండేటికి షాకిచ్చారాయన.

కౌంటరిచ్చిన హరీష్ శంకర్:
'2018' డబ్బింగ్ సినిమాను గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ కూడా మీడియా సమావేశానికి వచ్చారు. మన తెలుగు దర్శకులు ఎందుకు ఇలాంటి సినిమాలు చేయడం లేదని సురేష్ కొండేటి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారిగా సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ కొండేటి ఈ మధ్య యూట్యూబ్‌లో ఫేమస్ అవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఎవరు అడగని ప్రశ్న సురేష్ కొండేటి అడిగి ఫేమస్ అవ్వాలని చూస్తున్నారని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఒక సామేత ఉందంటా .. వినేవాడు సురేష్ అయితే..చెప్పేవాడు హరీష్ అంటా అంటూ సురేష్ కొండేటికి కౌంటరిచ్చారు.
అవి డబ్బింగ్ సినిమాలా?:
తెలుగు సినిమా , తమిళ సినిమా, హిందీ సినిమా అనేది లేదని.. సినిమా అంటే సినిమా అంతే అని హరీష్ శంకర్ తెలిపారు. RRR , కేజీఎఫ్, బాహుబలి సినిమాలు వచ్చిన తరువాత కూడా ఇలా మాట్లాడటం ఏంటి? బాహుబలి, RRR, కేజీఎఫ్ చిత్రాలు డబ్బింగ్ సినిమాలా? ప్రపంచం మొత్తం తెలుగు సినీ పరిశ్రమ వైపు చూస్తున్నది. మీరు తెలుగు సినిమాను తక్కువ చేసి మాట్లాడుతారా? అని హరీష్ శంకర్ ప్రశ్నించారు.

నేను డబ్బింగ్ సినిమాల నిర్మాతనే అంటూ:
అయితే ఇదే సమయంలో తాను ఓ నిర్మాతననే సురేష్ కొండేటి గుర్తు చేశారు. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి సూపర్ హిట్లను తెలుగులో తీసానని సురేష్ కొండేటి హరీష్ శంకర్ చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగు హీరోలైతే ఈ సినిమాలు చేయరని ఆయన వెల్లడించారు. దీంతో నిర్మాత బన్నీవాసు ఈ వివాదాన్ని సర్దుమణిగించే ప్రయత్నం చేశారు. నేను ఏదో సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చానని..దయచేసి దీనిని కాంట్రవర్సీ చేయవద్దని బన్నీవాసు కోరారు.


Click it and Unblock the Notifications











