AP Elections 2024: ఏపీ ఎన్నికల ఫలితాలపై డైరెక్టర్ పంచ్.. కరెక్ట్ టైమ్‌లో సూటయ్యే డైలాగ్‌తో!

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలే రసవత్తరంగా సాగుతుంటాయి. అందుకే మన పాలిటిక్స్‌పై అంతట ఎక్కువగా చర్చించుకుంటారు. అందుకు తగ్గట్లుగానే 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాయి. ఇకచ ఇప్పుడు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి సత్తా చాటుతోంది. దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ తాజాగా ఏం పోస్ట్ చేశాడో చూడండి!

ఎంతో ఉత్కంఠను రేపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడుతున్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి కూటమి భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. ఫలితంగా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది. దీంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతోంది.

Director Harish Shankar Special Tweet About AP Election Result

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో.. చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోని డైలాగుల వీడియోలను షేర్ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నాడు.

తాజాగా తన X (ట్విట్టర్) ఖాతాలో టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ 'గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం', 'గ్లాస్ పగిలే కొద్దీ పదును ఎక్కుద్ది' అనే డైలాగ్ వీడియోలను షేర్ చేశాడు. తద్వారా జనసేనతో కూడిన కూటమి విజయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక, హరీశ్ శంకర్ చేసిన ఈ ట్వీట్లపై ఆయా పార్టీల అభిమానులు మద్దతును తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X