నేను కూడా అంతే ఆకలితోనే ఉన్నాను.. వేరే హీరోల హిట్టు కొడితే పవన్ చెప్పే మాట ఇదే: హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో కనిపించడంతో అభిమానుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమా ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ తన మాటలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... తారలతో వేడుక కళకళ.. ఎవరెవరూ వచ్చారంటే..

ఆయన ఒక మాట చెబుతుంటారు

ఆయన ఒక మాట చెబుతుంటారు

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత వచ్చిన పండగ మనకు. అందుకే పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం చెబుదాం. లాక్ డౌన్ తరువాత కుదేలైపోయిన సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఎలాంటి అధికారం లేకపోయినా అందరికి పని కల్పించేలా సినిమాలు చేస్తున్నారు. అందుకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. మన ఫ్యామిలీ అంటే మనం మాత్రమే కాదు. సినిమా పరిశ్రమ మొత్తం మన ఫ్యామిలీ అని అంటుంటారు.

 సినిమా ఆయన్ని వదలదు.

సినిమా ఆయన్ని వదలదు.

ఎవరి సినిమా హిట్టయిన కూడా ఆయన ఆనంద పడతారు. ఇక ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్నా. సినిమా ఆయన్ని వదలదు. తొలిప్రేమ 100వ రోజు స్పెషల్ షోలు వేసినప్పుడు ఒక కుర్రాడు మరొక డిస్ట్రిబ్యూటర్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నారు. ఒకరు గబ్బర్ సింగ్ ని డైరెక్ట్ చేశారు. మరొకరు వకీల్ సాబ్ ని నిర్మించారు.. అని హరీష్ శంకర్ నవ్వుతూ మాట్లాడారు..

 ఏ కీలుకు ఆ కీలు తీసే వకీలు ఇతను

ఏ కీలుకు ఆ కీలు తీసే వకీలు ఇతను

నిర్మాత దిల్ రాజు డ్రీమ్ ఏప్రిల్ 9న నెరవేరబోతొంది. హీరో పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్పిన తరువాత ఆయన కళ్ళల్లో ఒక తృప్తి కనిపించింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను అద్భుతంగా తీశాడని అర్ధమయ్యింది. ఇక ట్రైలర్ చూశాక వకీల్ సాబ్ ఏ కీలుకు ఆ కీలు తీసే వకీలు ఇతను. ఈ వకీల్ సాబ్ కు వాదించడమే కాదు వాయించడం కూడా తెలుసు. వాదిస్తాడా వాయిస్తాడా అనేది అవతల వాళ్ల బిహేవియర్ ఆప్షన్ కు వదిలేస్తాను.. అని హరీష్ అన్నారు

బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు

బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు

మా బావ థమన్ గురించి ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ధైర్యంగా చెప్పగలను. తను వర్క్ చేసిన విధానంతోనే సంతృప్తి చెందాడని అర్ధమయ్యింది. ప్రతి పాట కూడా ప్రాణం పెట్టి కంపోజ్ చేశాడని చెప్పవచ్చు.. అని హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.

 నేను కూడా అంతే ఆకలితోనే ఉన్నాను.

నేను కూడా అంతే ఆకలితోనే ఉన్నాను.

మీరు కళ్యాణ్ గారి వకీల్ సాబ్ గురించి ఎంత ఆకలిగా ఉన్నారో నేను కూడా అంతే ఆకలితోనే ఉన్నాను. ఒక ఫ్యాన్ గా రచయితగా దర్శకుడిగా నేను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక మా సినిమా కోసం కూడా మేము ఎంతో కష్టపడుతున్నాము. ఇక ఏప్రిల్ 9న సెలబ్రేషన్స్ హ్యాపీగా మొదలవ్వాలని కోరుకుంటున్నాను అని.. హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X