జియర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న దర్శకుడు (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్...రీసెంట్ గా చిన జియర్ స్వామి వారిని ప్లైట్ లో కలవటం జరిగింది. ఆయనతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని, ఆ ఫొటోని షేర్ చేసారు. ఈ విషయం పై ట్వీట్ చేస్తూ...." జియర్ స్వామి వారిని కలవటం, ఆయనతో కలిసి ప్రయాణం చేయటం చాలా అదృష్టం. ఆయనతో మాట్లాడటం ఓ అద్బుతం. ఆయనతో మాట్లాడాక గౌరవం రెట్టింపైంది. ఆయన ప్రవచనాలను ఆచరణలోకి తేవటానికి ప్రయత్నిస్తాను ," అంటూ ట్వీట్ చేసారు.

'గబ్బర్‌సింగ్‌' చిత్రంతో ఘన విజయం సాధించిన హరీష్‌ శంకర్ మరోమారు అదే తరహా వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ‌. 'సింహా' వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పరుచూరి ప్రసాద్‌ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో మెగా కాంపౌండ్‌కి చెందిన సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తారు.

 Director Harish Shankar with GR Swamy!

నిర్మాత మాట్లాడుతూ ''వినోదం, వాణిజ్య అంశాల్ని కలగలిపి హరీష్‌శంకర్‌ ఓ కథని సిద్ధం చేసుకున్నారు. ఆయన గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో వినోదం పండబోతోంది. త్వరలో పూర్తి వివరాల్ని ప్రకటిస్తాం'' అన్నారు.

ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ 'రేయ్‌'తో హీరోగా మారాడు. ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం 'పిల్లా నువ్వు లేని జీవితం' అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఆయన మూడో చిత్రం కూడా ఖరారైనట్టు సమాచారం. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలోనే సాయి ధరమ్ తేజ హీరోగా తెలుపుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన హరీష్ శంకర్ వెను వెంటనే రామయ్యా వస్తావయ్యా అంటూ డిజాస్టర్ ఇచ్చారు. దాంతో ఆయన కంటిన్యూగా ప్రాజెక్టులు చేయాల్సిన హరీష్ ఖాళీ పడ్డారు. గతంలో రవి తేజ సుబ్రహ్మణ్యం పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినపడ్డాయి. తర్వాత అల్లు అర్జున్ అనుకున్నారు. చివరకు సునీల్ పేరు కూడా బయిటకు వచ్చింది.అయితే అవేమీ మెటీరియలైజ్ కాలేదు. దాంతో ఇప్పుడు మార్కెట్లో క్రేజ్ గా ఉన్న సాయి ధరమ్ తేజ తో ఆయన చిత్రం మొదలెట్టారు. ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొడతాననే ధీమాగా ఉన్నారు హరీష్ శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X