దర్శకుడిపై సైబర్ అటాక్
ఆ మధ్య వచ్చిన 'స్నేహ గీతం" సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన మధుర శ్రీధర్ గుర్తునాడా? పాపం ఇతగాడు ఇప్పుడు సైబర్ దొంగల చేతికి చిక్కి కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళితే....శ్రీధర్ మెయిల్ ఐడి, పాస్ వర్డును ఎవరో సైబర్ ఆకతాయిలు హ్యాక్ చేశారు. అతని స్నేహితులు, సన్నిహితులంతా షాకయ్యేలా మెయిల్స్ పంపారు. ''వెకేషన్ నిమిత్తం స్పెయిన్ దేశం వచ్చానని, కొందరు దొంగలు మమ్మల్ని నిలువు దోపిడి చేశారని, డబ్బు, క్రెడిట్ కార్డులన్నీ దోచుకెళ్లారని, పాస్ పోర్టు కూడా పోయిందని మీరు వెంటనే నాకు డబ్బు సాయం చేస్తే ఇండియా రాగానే ఇచ్చేస్తాను. మేము ఇక్కడ హోటల్ బిల్లు కూడా కట్టలేదు, బిల్లు కట్టనిదే హోటల్ వాళ్లు మమ్మల్ని విడిచేలా లేరు, పోలీసులు, ఇండియా ఎంబసీ అధికారులు కూడా మాకు ఎలాంటి సాయం చేయడం లేదు. ప్లీజ్ నన్ను వెంటన ఆదుకోండి"" అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో కంగారు పడ్డ సన్నిహితులు, స్నేహితులు వెంటనే అతని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా...నేను ఇక్కడే హైదరాబాద్ లోనే బేషుగ్గా ఉన్నాను అంటూ బదులిచ్చాడు. అప్పటికీ గానీ అర్థం కాలేదు మనోడికి తన ఈ మెయిల్ హ్యాక్ అయిందని.
వెంటనే తేరుకున్న శ్రీధర్ తన యాహూ మెయిల్ ద్వారా....''తాను స్పెయిన్ లో ఇరుక్కున్నట్లు వచ్చిన మెయిల్స్ ను నమ్మవద్దు"" అంటూ తిరిగి మళ్లీ మెయిల్ పంపారు. తాను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని, తాను తీస్తున్న 'ఇట్స్ మై లవ్" సినిమా ఎడిటింగ్ లో బిజీగా ఉన్నానని, ఇతర వివరాలకు ఫేస్ బుక్ ద్వారా తనను కాంటాక్టు కావాలని అందులో పొస్టు చేశాడు.


Click it and Unblock the Notifications











