వారి కనుసన్నల్లోనే... చిరు చెప్పకుండా నాగబాబు ఎలా? ‘మా’ ఎన్నికపై దర్శకుడి కామెంట్!

'మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు జరిగిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. శివాజీ రాజా ప్యానల్, నరేష్ ప్యానల్ పోటీ పడిన తీరు, ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకున్న విధానం చూసి ప్రజలు విస్తుపోయారు. ఈ ప్యానల్ వెనక ఎవరో ఉన్నారు, ఆ ప్యానల్ వెనక ఎవరో ఉన్నారు అనే ప్రచారం కూడా ఈ ఎన్నికలను మరింత రాజకీయం చేశాయి.

'మా' ఎన్నికలు జరిగిన తీరుపై సీనియర్ దర్శకుడు, జర్నలిస్ట్ ఇమ్మండి రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సేవ చేయడానికి పోటీ ఎందుకో అర్థం కాలేదు. ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నకుంటే సరిపోయేది, ఎన్నికలు జరిగిన తీరును తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.

చిరంజీవి అనుమతి లేకుండా నాగబాబు ఎలా?

చిరంజీవి అనుమతి లేకుండా నాగబాబు ఎలా?

చిరంజీవిగారి అనుమతి లేకుండా నాగబాబు గారు అలా ఓపెన్‌గా శివాజీ రాజా ప్యానెల్‌కు వ్యతిరేకంగా మాట్లాడరు. చిరంజీవిగారు ఒక వేళ శివాజీ రాజా ప్యానెల్‌కు మద్దతుగా ఉంటే అపుడు నాగబాబు రాడుకదా.... అని రామారావు వ్యాఖ్యానించారు.

శివాజీ రాజా, శ్రీకాంత్ వీళ్లంతా బాగా చేశారు

శివాజీ రాజా, శ్రీకాంత్ వీళ్లంతా బాగా చేశారు

నరేష్ ప్యానల్ వారు ఒక అవకాశం మాకు ఇవ్వండి చేసి చూపిస్తామని ప్రచారం చేశారు. ఓటర్స్ అంతా కూడా ఒక వైపు వెళ్లడం ఆలోచించాల్సిన విషయం. శివాజీ రాజా, శ్రీకాంత్ వీళ్లంతా బాగా చేశారు. అయినప్పటికీ అంతా నరేష్‌ను గెలింపించడంలో వారి నమ్మకం ఏమిటి? అనేది భవిష్యత్తులో వారు చేసే పనులను బట్టి తెలుస్తుంది.

వెనక ఉండి పెద్ద పెద్ద స్టార్స్ మద్దతు ఇవ్వడం కొత్తకాదు

వెనక ఉండి పెద్ద పెద్ద స్టార్స్ మద్దతు ఇవ్వడం కొత్తకాదు

నరేష్ గారికి మహేష్ బాబు సపోర్ట్ కూడా తప్పకుండా ఉంటుంది. వెనక ఉండి పెద్ద పెద్ద స్టార్స్ మద్దతు ఇవ్వడం అనేది కొత్త విషయం కాదు. ఆ రోజుల్లో రామారావుగారు, నాగేశ్వరరావులను కూడా ఇలాగే సపోర్ట్ చేసేవారు. వీరిని ఎంకరేజ్ చేస్తే బావుంటుందేమో అనేవారు, బయటకు చెప్పేవారు కాదు. అదే అందరికీ వేదవాక్కుగా ఉండేదని... ఇమ్మండి రామారావు గుర్తు చేసుకున్నారు.

ముందు నుంచి వారి కనున్నల్లోనే...

ముందు నుంచి వారి కనున్నల్లోనే...

మద్రాసులో ఎన్టీ రామారావు తమ్ముడు సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంటుగా పదిహేను సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావుగారు, త్రివిక్రమరావుగారు ఏది అనుకుంటే అదే జరిగేది. ఇలా చేద్దాం అంటే అది జరిగేది. ముందు నుంచి పెద్దవారి కనుసన్నల్లోనే మన పరిశ్రమ మెదులుతూ వచ్చిందన్నారు.

సారథులే కానీ నిర్దేశకులు కాదు

సారథులే కానీ నిర్దేశకులు కాదు

గెలిచిన వారంతా సారథులే కానీ నిర్దేశకులు కాదు. దిశ దశ చెప్పేవారు వెనక ఎవరో ఉంటారు. ఈ పద్దతి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అదే ఉందని నేను అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో, ఎవరిపై గౌరవం ఉంటుందో అలాంటి వారి మాటే అందరూ వింటారని ఇమ్మండి రామారావు వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X