twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వద్దు: డైరెక్టర్ విన్నపం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ రాజకీయ ప్రవేశం అనే అంశంపై రకరకాల చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. కొందరు అభిమానులు పవన్ లాంటి వ్యక్తులు ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడంతో ఎంతో అవసరం అని అంటుంటే....మరికొందరు మాత్రం ఈ కుళ్లు రాజకీయాల్లోకి వచ్చి పవన్ లాంటి మంచి వ్యక్తి మలిన పడొద్దు అని సూచిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్‌తో 'తీన్‌మార్' చిత్రం తెరకెక్కించిన దర్శకుడు జయంత్ సి. పర్జానీ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావొద్దని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సోషల్ నట్వర్కింగ్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఈ బుదర రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని సూచించారు.

     Director Jayanth.C.Paranjee request to Pawan Kalyan

    'డియర్ పవన్ కళ్యాణ్, ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. దయచేసి రాజకీయాల్లోకి రావొద్దు. ఇదొక మురికి కూపం. నీలాంటి పవిత్రమైన మనసుగల వ్యక్తులు రావాల్సిన చోటు కాదు. మీరు వ్యవస్థను మార్చాలనుకుంటే రాజకీయాల ద్వారా కాకుండా బయటి నుండి ఏదైనా చేయండి' అని సూచించారు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్లో టాప్ స్టార్. ఆయన వ్యక్తిత్వం ఎలాంటితో అందరికీ తెలిసిందే. మీడియాకు వీలైనంత దూరంగా ఉండే పవన్ కళ్యాణ్....ఈ సారి కావాలని మీడియాకు చేతి నిండా పనికల్పించారు. మార్చి రెండో వారంలో రాజకీయాలపై తన అభిప్రాయాన్నీ, పార్టీ స్థాపించే విషయం గురించి, ఎన్నికలలో పోటీ చేసే విషయం గురించి స్వయంగా వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది.

    English summary
    
 "pls DO NOT get into politics..its a dirty swamp for a simple n straight guy like u.." Director Jayanth.C.Paranjee request to Pawan Kalyan via facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X