మహేష్ నుంచి కేవలం 75 మాత్రమే కోరిన పూరి
సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ సినిమా ప్లాన్ చేసిన...క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నాడు. ఈ మేరకు పూరి మహేష్ బాబును కేవలం 70 నుంచి 75 రోజుల తనకోసం కేటాయిస్తే చాలు, సినిమా పూర్తి చేస్తానని భరోసా ఇచ్చాడు. మహేష్ బాబు కూడా పూరి ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు తెలుస్తూంది.
సెప్టెంబర్ 1న షూటింగ్ ప్రారంభించి 75 రోజుల్లో టాకీ పార్ట్ పూర్తి చేయాలని ముందే స్కెచ్ వేసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి పట్టుదల కేవలం టాలీవుడ్ వర్గాలనే కాదు, ఆ సినిమాకు పని చేస్తున్న యూనిట్ సభ్యలును కూడా షాక్ కు గురి చేసింది. సాధారణంగా టాప్ హీరోల సినిమాలను దర్శకులు చాలా కేర్ తీసకుని, నెలలు సంవత్సరాలు సమయం తీసుకుని పూర్తి చేస్తుంటారు. పూరి ఇప్పు డు ఆ ధోరణిని మార్చే పనిలో పడ్డాడు.
అంతా అనుకున్నట్లు జరిగితే...మహేష్ కెరీర్ లో 4-5 నెలల గ్యాప్ తో రిలీజైన తొలి సినిమాగా...బిజినెస్ మ్యాన్ రికార్డు సృష్టించనుంది. పూరి మాట ప్రకారం సినిమాను కంప్లీట్ చేస్తే జనవరి 12, 2012 కల్లా సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











