ఆడవాళ్లు తప్పు చేస్తే కరెక్ట్ చేయలేం.. కానీ మగవాడు తప్పు చేస్తే.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలకు కారణం మహిళలే అంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సోమవారం ఓ సినిమా ఆడియా ఫంక్షన్‌కి అతిథిగా హాజరైన ఆయన మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అంతా షాకయ్యారు. ఇంతకీ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

మహిళలు హద్దులు దాటుతున్నారంటూ సంచలనం
ప్రస్తుత పరిస్థితులు ఇదివరకటిలా లేవని, మహిళలు హద్దులు దాటుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భాగ్యరాజ్. మహిళలు తమ తమ కట్టుబాట్లను పక్కన బెట్టేయడం కారణంగానే ఈ హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయంటూ బాంబ్ పేల్చారు. భాగ్యరాజ్ ఇలా మాట్లాడటం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

సెల్‌ఫోన్‌తోనే కాలం.. రేప్‌లకు కారణం
ఇంకా ఆయన మాట్లాడుతూ.. స్త్రీలపై వేదింపులు, అత్యాచారాలు కేవలం వారి అజాగ్రత్త వల్ల మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత మహిళలు ఎక్కువగా సెల్‌ఫోన్‌తోనే కాలం గడుపుతున్నారని, వారిపై జరుగుతున్న హత్యాచారాలకు ఇది కూడా ఓ కారణమే అన్నారు భాగ్యరాజ్. అప్పట్లో మహిళలు మహిళలు కట్టుబాట్లతో ఉండేవారని, అందుకే ఆ రోజుల్లో ఇలాంటి దారుణాలు జరగలేదని అన్నారు.

పొల్లాచ్చి ఘటన.. అమ్మాయిలు చేసిన పొరపాట్లు
ఇక ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి ఘటనను ప్రస్తావించిన భాగ్యరాజ్.. ఈ విషయంలో కేవలం అబ్బాయిలను మాత్రమే తప్పు పట్టడం కరెక్ట్ కాదంటూ సరికొత్త లాజిక్ లేవనెత్తారు. అమ్మాయిలు చేసిన పోరపాట్లను మాత్రమే అబ్బాయిలు ఉపయోగించుకుంటున్నారని, అమ్మాయి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు జరగవని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మహిళల పెట్టుకుంటున్న అక్రమ సంబంధాలు
మగవారిని అన్యాయం చేసే స్త్రీలు చివరకు వారే అన్యాయమవుతారని భాగ్యరాజ్ పేర్కొన్నారు. మగవాడు తప్పు చేస్తే, తరువాత కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఆడవాళ్లు తప్పు చేస్తే కరెక్ట్ చేయలేం అని ఆయన అనడం చర్చనీయాంశంగా మారింది. మహిళలు భర్తలను చంపేయడం, మహిళల పెట్టుకుంటున్న అక్రమ సంబంధాలు ఇలాంటి వాటిపై దారుణమైన కామెంట్స్ చేశారు భాగ్యరాజ్.
Recommended Video

సినీ ఇండస్ట్రీలో దుమారం.. డైరెక్టర్ తీరు
మహిళలు పరిమితుల్లో ఉంటేనే మంచిదని భాగ్యరాజ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. గతంలో రాధా రవి కూడా ఇలాగే నయనతారపై కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ పెద్ద రచ్చకు దారితీయడం చూశాం. మళ్ళీ ఇప్పుడు అదే టైపులో భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











