twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింపుల్ లాజిక్.. ఇండస్ట్రీ పెద్ద అనే ప్రశ్నకు కె.రాఘవేంద్రరావు ఊహించని కామెంట్!

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఐక్యత లేదు అనేది ప్రస్తుతం ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అనేక రకాల విభేదాలు వస్తుండడంతో మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి MAA ఎన్నికలు కూడా తీవ్ర ఆందోళన మధ్యలోనే కొనసాగాయి. ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఎవరూ లేరు కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఇటీవల సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అనేదానిపై కూడా చాలా తెలివిగా ఒక వివరణ ఇచ్చారు.

    మొదటి సారి స్పెషల్ రోల్

    మొదటి సారి స్పెషల్ రోల్

    సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఇటీవల పెళ్లి సందD సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటించింది. ఇక మొదిసారిగా సినిమా ద్వారా కె.రాఘవేంద్రరావు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించారు. ఆయన పాత్రతోనే ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మొదటి మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకని ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. అంతేకాకుండా దర్శకేంద్రుడు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ వస్తున్నారు.

     పెద్ద దిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు..

    పెద్ద దిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు..


    ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కె.రాఘవేంద్రరావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పై అలాగే ఇండస్ట్రీలోని పెద్ద దిక్కు ఎవరు అనే అంశంపై కూడా తనదైన శైలిలో స్పందించారు. ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పెద్ద దిక్కుగా ఎవరూ లేరు అని మాటను ఎక్కువగా నేను కూడా వింటున్నాను. అసలు ఇండస్ట్రీకి ఎవరు పెద్ద దిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తారు ఉంటూ సాధారణంగా మన ఇంట్లో పిల్లలు మన మాట సరిగ్గా వినరు.. అలాంటివి ఎవరో ఎందుకు వింటారు అని వివరణ ఇచ్చారు.

    శత్రువులుగా ఉండకూడదు..

    శత్రువులుగా ఉండకూడదు..

    నిజానికి సింపుల్ లాజిక్. ఇక్కడ ఎవరు ఎవరి మాట అసలు వినరు కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. అనవసరంగా మనం చెప్పడం ఎందుకు ఆ తర్వాత చెబితే వినలేదు అని బాధపడడం ఎందుకు. నేను ఇండస్ట్రీలో నేర్చుకున్నది ఏమిటి అంటే నాకు ఎవరు కూడా శత్రువులుగా ఉండకూడదు అంతేకాకుండా అనవసరంగా ఉచిత సలహాలు కూడా ఇవ్వకూడదు అని ఒక బలమైన నిర్ణయంతో ముందుకు సాగుతున్నాను. ఎవరైనా సరే మంచి కోసం చెప్పాలని అనుకున్నా కూడా మరొక విధంగా ఆలోచించే వారు చాలామంది ఉంటారు. అందుకే మనకు ఎందుకు వచ్చిన గొడవ అని నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను అని తెలియజేశారు.

    Recommended Video

    Pelli SandaD Movie Success Celebrations
    అది కాపాడుకుంటే చాలు

    అది కాపాడుకుంటే చాలు

    మనం ఎంత చెప్పినా కూడా మన ఇంట్లో పిల్లలు వాళ్లకి నచ్చింది మాత్రమే చేస్తారు. అందుకే ఇతరులకు చెప్పడం అనేది అనవసరమైన పని అని నేను అనుకుంటాను. ఇండస్ట్రీలో ఎవరికీ ఏమి చెప్పాల్సిన పని లేదు అని కె.రాఘవేంద్రరావు చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ఉన్న గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను కూడా ప్రయత్నిస్తాను అంటూ అలా ఉంటేనే ఇతరులు ఎక్కువగా గౌరవిస్తారు అనే తెలియజేశారు.

    English summary
    Director k Raghavendra Rao about maa elections and industry big,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X