CBN Arrest వడ్డీతోపాటు తీర్చుకొంటాం.. చంద్రబాబు అరెస్ట్‌పై నారా రోహిత్, రాఘవేంద్రరావు సెన్సేషనల్ ట్వీట్స్
ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ వాతావారణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీలో పలు జిల్లాలో ఉద్రిక్త వాతవారణం నెలకొన్నది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్ట్‌ను అడ్డుకొనేందుకు తెలుగు దేశం పార్టీ నేతలు ప్రయత్నించడంతో నంద్యాల, విజయవాడ, ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఆయన పార్టీ వర్గాలు, స్నేహితులు, సన్నిహితులు ముక్త కంఠంతో ఖండించారు. ఈ క్రమంలో హీరో నారా రోహిత్, దర్శకుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ..
మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను రాఘవేంద్రరావు ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ఉన్ అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చి పోతున్నందుకు బాధపడుతున్నాయి అని రాఘవేంద్రరావు ట్వీట్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ స్పందించారు. నియంతృత్వం నిజమైనప్పుడు, విప్లవం కూడా హక్కుగా మారుతుంది అని ప్రముఖుడు విక్టర్ హ్యుగో చెప్పిన సూక్తిని పోస్టు చేశాడు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ప్రతీ పైసా వడ్డీతో కక్కిస్తాం. అది ఎప్పుడనేది సమయమే సమాధానం చెబుతుంది అని నారా రోహిత్ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తాం. చంద్రబాబు నాయుడు అంటూ హ్యాష్ ట్యాగ్స్‌తో ట్వీట్ చేశాడు.

నంద్యాలలో అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని విజయవాడలోని సిటీ కోర్టు కాంప్లెక్స్‌కు తీసుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ అభిమానులు, పార్టీ వర్గాలు, మహిళా నేతలు అక్కడికి చేరుకొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశార.


Click it and Unblock the Notifications











