24 ఏళ్ళ తరువాత దర్శకేంద్రుడి మరో పెళ్లి సందడి.. హీరోగా సీనియర్ హీరో తనయుడు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సీనియర్ దర్శకులలో కె.రాఘవేంద్రరావు ఒకరు. మూడు తరాల జనరేషన్స్ వర్క్ చేసిన దర్శకేంద్రడి సినిమాలు అంటే ఇప్పటికి కూడా ఆడియెన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టవని చెప్పవచ్చు. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలను చాలా అందంగా తెరకెక్కించగల ఆయన మేకింగ్ అంటే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. ఇక రాఘవేంద్రరావు మ్యూజికల్ రొమాంటిక్ సినిమాలను మిస్సవుతున్న ఆడియెన్స్ కి ఆయన ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

మరో పెళ్లి సందడి

మరో పెళ్లి సందడి

గత కొన్ని రోజులుగా దర్శకేంద్రుడు ఒక కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నాడని అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రోమోతో ఒక క్లారిటీ ఇచ్చారు. 1996లో వచ్చిన పెళ్లి సందడి లాంటి సినిమా మళ్ళీ రాబోతోందని చెబుతూ టెక్నీషియన్స్ పేర్లను ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అని ఆ ప్రోమో మ్యూజిక్ వినగానే అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.

బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్

బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్

24ఏళ్ళ క్రితం శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన ట్రయాంగిల్ లవ్ స్టొరీ ప్రేమ సందడి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తక్కువ బడ్జెట్ లో అల్లు అరవింద్, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా అందులో ఉన్న అన్ని పాటలను జనాలు అమితంగా ఆస్వాదిస్తారు.

హీరోగా శ్రీకాంత్ తనయుడు

హీరోగా శ్రీకాంత్ తనయుడు

ఇక 24 సంవత్సరాల అనంతరం పెళ్లి సందD తో మళ్ళీ సరికొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు దర్శకేంద్రుడు వివరణ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గాని శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ కెరీర్ మొదట్లోనే పెళ్లి సందడి సినిమాతో మంచి బూస్ట్ అందుకొని ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు రోషన్ కూడా అదే టైటిల్ తో రెగ్యులర్ హీరోగా బిజీ కావాలని అనుకుంటున్నాడు.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
త్వరలో నటీనటులపై అఫీషియల్ క్లారిటీ

త్వరలో నటీనటులపై అఫీషియల్ క్లారిటీ

కొన్నేళ్ల క్రితం రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చదువు కారణంగా కొంత గ్యాప్ ఇచ్చిన రోషన్ ఇప్పుడు పెళ్లి సందడDతో రెగ్యులర్ నటుడిగా బిజీ కావాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో రోషన్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక తన మెయిన్ టెక్నీషియన్స్ గురించి చెప్పిన దర్శకేంద్రుడు త్వరలో నటీనటులపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X