twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం... ‘నేల టిక్కెట్టు’తో మార్పు రావాలి: సుబ్బరాజు

    By Bojja Kumar
    |

    Recommended Video

    దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నటుడు సుబ్బరాజు తో స్పెషల్ చిట్ చాట్

    రవితేజ, మాళ్విక శర్మ హీరో హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. మే 25న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గత రెండు మూడు రోజులుగా సినిమా టీం ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, సుబ్బరాజు చిన్న సినిమా గురించి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతున్నామని, 'నేల టిక్కెట్టు'తో అయినా కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

    దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గురించి..

    దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గురించి..

    సుబ్బరాజు మాట్లాడుతూ... ‘ఒక బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, పోతున్నాయి. ఈ బంచ్‌లో కొన్ని సినిమాలు చాలా కొత్తగా అనిపించాయి. పల్లెటూరి గెటప్‌లో నాగార్జున‌గారు, రమ్యకృష్ణగారు.... మేము చదువుకునే రోజుల్లో ఈ ఇద్దరి జంట అప్పట్లో చాలా ఫేమస్. మళ్లీ వారి కాంబినేషన్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా' అంటూ కళ్యాణ్ కృష్ణ ఒక మంచి సినిమా చేశారు. తర్వాత ‘రారండోయ్ వేడక చూద్దాం' లాంటి ఫ్యామిలీ ఎంటర్టెనర్ చేశాడు. ఇపుడు ‘నేల టిక్కెట్టు' ద్వారా ఒక మంచి కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అని సుబ్బరాజు తెలిపారు.

     ఇలా బ్రతుకుతున్న రోజులు...

    ఇలా బ్రతుకుతున్న రోజులు...

    చుట్టూ సోషల్ మీడియా, మధ్యలో మనం బ్రతకుతున్న రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో చట్టూ జనం మధ్యలో మనం కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ కదా ఇపుడు కావాల్సింది అని అనిపించింది.... అని సుబ్బరాజు తెలిపారు.

     చాలా దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం

    చాలా దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం

    సోషల్ మీడియా వల్ల ఎలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చిదంటే... వీడు వీడితో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ గురించి పట్టించుకోవడం లేదు. ఇంకోడు ఎవడో ఎంజాయ్ చేసిన వాటిని సోషల్ మీడియాలో చూసి ఈర్ష్య పడుతున్నాడు. సోషల్ మీడియా అనేది కమ్యూనికేషన్ గురించి సృష్టించింది. చుట్టూ ఉన్న జనాలను పట్టించుకోకుండా దాంట్లోనే మునిగి తేలాలనికాదు అని సుబ్బరాజు తెలిపారు.

    పెద్దవాళ్లపై రెస్పెక్ట్ పెరుగుతుంది

    పెద్దవాళ్లపై రెస్పెక్ట్ పెరుగుతుంది

    ఒక మంచి సినిమాను కళ్యాణ్ కృష్ణ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఈ సినిమాతో అయినా మన చుట్టూ ఉన్న జనాలను పట్టించుకోవాలి, పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఆలోచన అందరిలో కలుగుతుందని భావిస్తున్నాను అని సుబ్బరాజు తెలిపారు.

    అనుకున్న విధంగా సినిమా తీశాం

    అనుకున్న విధంగా సినిమా తీశాం

    దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ...నేను అనుకున్న క్వాలిటీలో సినిమా కంప్లీట్ చేశాము. ఔట్ పుట్ చూసిన తర్వాత చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అని తెలిపారు.

    English summary
    Director kalyan krishna says he makes films that he'd like to watch them as an audience in theater. Whenever you make a movie, a lot of stakes are involved as the producer and hero's reputation is at stake. Nela ticket coming theaters on may 25.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X