సుమంత్ హీరోగా వచ్చిన చిన్నోడు చిత్రం దర్శకుడు కన్మణి త్వరలో చెన్నై లో పెళ్ళి చేసుకోనున్నాడు. ఆయన చేసిన కాల్ సెంటర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన రవళితో ఆయన ప్రేమలో పడ్డారు. అది పెరిగి ఇరు వైపుల పెద్దల అంగీకారంతో పెళ్ళిగా రూపొందుతోంది. ఇక కన్మణి తెలుగులో మొదట నవీన్ హీరోగా నా ఊపిరి చిత్రాన్ని రూపొందించి తన ఉనికి చాటుకున్నాడు. చిన్నోడు చిత్రం ప్లాఫ్ అయినా, కాల్ సెంటర్ సి గ్రేడ్ సినిమాగా పేరు తెచ్చుకున్నా అతనికి సినిమాలకు లోటు లేదు. తాజాగా ఆయన తమిళ, తెలుగు భాషల్లో పరిమళ్, సంధ్య ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం మే ఇరవైన రిలీజ్ కాబోతోంది. వివాహానంతరం తన భార్య రవళి సినిమాల్లో నటించటంపై ఆయనకేమీ అభ్యంతరం లేదని చెప్తున్నారు. విష్ యు ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.