పవన్ కళ్యాణ్ ఏమైనా డేట్స్ ఇస్తాడా.. మాసిన గడ్డంతో వెళితే.. డైరెక్టర్ హాట్ కామెంట్స్!

పీపుల్స్ స్టార్ శ్రీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ 2019. కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకుడు. 2007లో మంచి విజయం సాధించిన ఆపరేషన్ దుర్యోధన చిత్రానికి దీనిని సీక్వెల్ గా రూపొందించారు. డిసెంబర్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి స్థాయిలో రాజకీయ అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నా కొన్ని వర్గాల ప్రేక్షకులలో డివైడ్ టాక్ కూడా ఉంది. చిత్రానికి వస్తున్న స్పందనపై చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు బాబ్జి, హీరో శ్రీకాంత్ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

 బావుంది అంటున్నారు

బావుంది అంటున్నారు

దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రతి ఒకరు బావుంది, పర్వాలేదు అంటూ బయటకు వస్తున్నారు. ఎవరూ కూడా సినిమా అసలు బాగోలేదని అనడం లేదు. ప్రతి షోకు ఆదరణ పెరుగుతోంది అని బాబ్జి తెలిపాడు. ఇది చెత్త సినిమా, టైం వేస్ట్ అని ఎవరూ అనడం లేదు అంటూ నెగిటివ్ కామెంట్స్, రివ్యూలపై స్పందించారు. ఒక బాధ్యతగల పౌరుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించానని బాబ్జి అన్నారు. సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం చేయవద్దని కోరారు.

పవన్ కళ్యాణ్ ఏమైనా డేట్స్ ఇచ్చారా

పవన్ కళ్యాణ్ ఏమైనా డేట్స్ ఇచ్చారా

దేశ భవిష్యత్తు యువత చేతుల్లో కాదు, ఓటర్ చేతుల్లో ఉందనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని బాబ్జి అన్నారు. కొంతమంది ఈ చిత్రాన్ని స్టార్ హీరోలతో చేసి ఉంటే బావుండేదని అంటున్నారు. ఈ సినిమాకు స్టార్ హీరోలు అవసరం లేదు. కథ ఎవరిని డిమాండ్ చేస్తే వారితోనే సినిమా తీయాలి. కొంతమంది పవన్ కళ్యాణ్ తో తీసి ఉంటే బావుండేదని అంటున్నారు. ఆయన ఏమైనా నాకు డేట్స్ ఇస్తారా అని బాబ్జి ఘాటుగా వ్యాఖ్యానించారు.

మాసిన గడ్డం అంటే

మాసిన గడ్డం అంటే

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాసిన గడ్డంతో వెళితే ఓట్లు పడవు అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ పై అని అనుకుంటున్నారు. ఆ డైలాగ్ లో అర్థం పవన్ కళ్యాణ్ ని తిట్టినట్లు కాదు. సందర్భాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలని బాబ్జి హితవు పలికారు. అన్ని సినీల్లో కమర్షియల్ హంగులు ఉండవు. అంతమాత్రాన అవి మంచి సినిమాలు కాకుండా పోవు అని బాబ్జి అన్నారు.

అన్నీ ముద్దుల సినిమాలే

అన్నీ ముద్దుల సినిమాలే

అన్ని చిత్రాలు ముద్దులతోనే తీయాలా అంటూ ఇటీవల వస్తున్న బోల్డ్ కంటెంట్ మూవీస్ పై ఘాటుగా స్పందించారు. ఈ చిత్రానికి చాలా మంది మంచి రివ్యూలు రాశారు.. కొందరు తప్ప అని బాబ్జి అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఇటీవల నా చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రం ఇది అన్నారు. రివ్యూలు కొందరు చాలా హార్ష్ రాశారు. అది చాలా బాధ కలిగించిందని శ్రీకాంత్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎన్నికల వాతావరణానికి తగ్గట్లుగా మంచి సినిమా చేసారని చాలా మంది ప్రశంసిస్తున్నట్లు శ్రీకాంత్ అన్నారు.

 ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా

ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా

ఆపరేషన్ 2019 ప్రతి ఒక్కరూ ఆలోచించేలా ఉంటుందని శ్రీకాంత్ అన్నారు. గతంలో నేను చేసిన ఆపరేషన్ దుర్యోధన, ఇప్పుడు వచ్చిన ఆపరేషన్ 2019 చిత్రాలు సామజిక అవసరం కోసం చేసిన చిత్రాలు అని శ్రీకాంత్ అన్నారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ డైలాగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని శ్రీకాంత్ తెలిపారు. ఈ చిత్రాన్ని చూసి 20 మంది ఓటర్లు మారినా చాలా బావుంటుందని శ్రీకాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X