విజయ్ దేవరకొండ తెలంగాణ పవర్ స్టార్ ఏంటి.. వర్మపై సెటైర్, దర్శకుడి ఘాటు వ్యాఖ్యలు!
Recommended Video

అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. జాతీయ వ్యాప్తంగా ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. పరభాషా నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కులని సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ వంగా ఓవర్ నైట్ లో క్రేజీ సెలెబ్రిటీలు గా మారిపోయారు. అర్జున్ రెడ్డి చిత్రంపై, విజయ్ దేవరకొండపై యువ దర్శకుడు కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ దర్శకుడు ప్రస్తుతం ఎంత ఘాటు ప్రేమయో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర కాన్సెప్ట్ వీడియోపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ పవన్ కళ్యాణ్ పై, పరోక్షంగా వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ ట్విస్ట్
తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కార్తీక్ తెలిపాడు. ఈ విషయం చెబితే నమ్మరని తనకు నచ్చిన దర్శకుడు కూడా పవన్ కల్యాణే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. తాను జానీ చిత్రం చూశాకే దర్శకుడిని కావాలని అనుకున్నట్లు కార్తీక్ తెలిపాడు.

అర్జున్ రెడ్డి 2 కాదు
కార్తీక్ రూపొందిస్తున్న ఎంత ఘాటు ప్రేమయో చిత్ర కాన్సెప్ట్ వీడియో ఇటీవల విడుదల చేశారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని పోలిఉందని, అర్జున్ రెడ్డి 2 అంటూ వస్తున్న కామెంట్స్ పై కార్తీక్ స్పందించాడు. తన చిత్రాన్ని అర్జున్ రెడ్డి 2 అనడం నచ్చడం లేదని కార్తీక్ తెలిపాడు.

అర్జున్ రెడ్డి బావుంది కానీ
అర్జున్ రెడ్డి చిత్రం హీరో నటన, దర్శకుడు ప్రతిభ ఆధారంగా విజయం సాధించిన చిత్రం అని అన్నారు. అర్జున్ రెడ్డి చిత్రం బావుంది కానీ కథ పరంగా గొప్ప చిత్రం కాదని కార్తీక్ అభిప్రాయ పడ్డాడు.

పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా
అర్జున్ రెడ్డి చిత్రం విడుదలయ్యాక ఓ దర్శకుడు పవన్ కళ్యాణ్ ని కించపరిచేలా ట్విట్స్ చేసాడని, పవన్ కళ్యాణ్ కంటే విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడని వర్మని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని హర్ట్ చేసేవిగా ఉన్నాయని కార్తిక్ తెలిపాడు.

తెలంగాణ పవర్ స్టార్ ఏంటి
అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండని తెలంగాణ పవర్ స్టార్ అని కొందరు సంభోదించారు. అది కూడా నాకు నచ్చలేదు. ఒక హీరోని మరో హీరోతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే అని కార్తీక్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











