twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపేస్తామని బెదిరింపులు... ఏదైనా జరిగితే మంచు ఫ్యామిలిదే బాధ్యత.. ఓటర్ దర్శకుడి లేఖ

    |

    Recommended Video

    Director Karthik Reddy Complaints About Manchu Vishnu || Filmibeat Telugu

    సినీ హీరో మంచు విష్ణు నటించిన ఓటర్ చిత్ర వివాదం అగ్గి రాజేస్తున్నది. మంచు విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి, దర్శకుడు కార్తీక్ రెడ్డి, నిర్మాత పూదోట సుధీర్ ఆరోపణలు, వివరణలతో మీడియాలో రచ్చగా మారింది. తాజాగా దర్శకుడు, నిర్మాతలపై మంచు విష్ణు వర్గం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా మంచు విష్ణు చేస్తున్న ఆగడాలను వివరిస్తూ తెలుగు సినిమా దర్శకుల సంఘానికి దర్శకుడు కార్తీక్ రెడ్డి సుదీర్ఘమైన లేఖను సంధించారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ లేఖలో ఏమని వెల్లడించారంటే...

     మంచు విష్ణుతో సరదా సినిమా

    మంచు విష్ణుతో సరదా సినిమా

    మంచు విష్ణుతో సరదా అనే సినిమాకు దర్శకత్వం వహించాను. ఆ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు నావే. ఆర్థిక కారణాల వల్ల సినిమా పూర్తి చేయలేకపోయాం. ఆ తర్వాత స్వర్గీయ దాసరి నారాయణరావు కథ సూరీడును మోహన్ బాబు, విష్ణుతో సేనాపతిగా రూపొందించాలని ప్రయత్నించాం. సీన్స్ మార్చాలంటూ కథలో మోహన్ బాబు, విష్ణు జోక్యం చేసుకోవడం, నన్ను వేధించడం వల్ల ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను.

     మోహన్‌బాబుతో సేనాపతి మూవీ కోసం

    మోహన్‌బాబుతో సేనాపతి మూవీ కోసం

    సేనాపతి సినిమా నుంచి తప్పుకోనే సమయంలో ‘సార్ నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నాను. మళ్లీ మంచి కథ, ప్రొడ్యూసర్‌తో విష్ణుతో సినిమా తీయడానికి వస్తాను అని అన్నాను. ఆ మాట ప్రకారమే పవర్‌ఫుల్ అనే పేరుతో కథ రాశాను. దానిని విష్ణుకు ప్రొడ్యూసర్స్‌ను కల్పించి సింగిల్ సిట్టింగ్‌లోనే కథను ఓకే చేయించాను. తెలుగు తమిళ భాషల్లో సినిమాను మొదలుపెట్టాం.

     ఓటర్‌లో మంచు విష్ణు జోక్యంతో

    ఓటర్‌లో మంచు విష్ణు జోక్యంతో

    ఓటర్ సినిమా షూటింగ్ సవ్యంగా సాగుతుంటే విష్ణు జోక్యం ఎక్కువైంది. కొన్ని సీన్లు మార్చమని మళ్లీ ఒత్తిడి తెచ్చారు. అందుకు నేను అంగీకరించలేదు. దాంతో కొందరు సీనియర్ రైటర్లను తీసుకొచ్చి వారి అభిప్రాయాలను నాపై రుద్దాలని ప్రయత్నించారు. మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తే వాడికి నేను చెబుతాలే అని నన్ను పంపించారు. ఆ తర్వాత ఆయన పట్టించుకోలేదు.

     కథకు సంబంధం లేకుండా మార్పులు

    కథకు సంబంధం లేకుండా మార్పులు

    కథకు ఉపయోగం లేకపోయినా మంచు విష్ణు బలవంతంగా సినిమాలోని రెండు సీన్లు మార్చారు. ఇదివరకే సరదా ఆగిపోయిందనే కారణంతో నేను రాజీ పడి ఓటర్‌ షూటింగ్‌ను ముందుకు తీసుకెళ్లాను. నా సినిమా ఆగిపోవద్దని ఇగోను పక్కన పెట్టి సినిమాను పూర్తి చేశాను.

     స్టోరీ క్రెడిట్ ఇవ్వాలని విష్ణు డిమాండ్

    స్టోరీ క్రెడిట్ ఇవ్వాలని విష్ణు డిమాండ్

    సినిమా అంతా పూర్తయ్యాక ఓటర్ మూవీ బాగా రావడంతో స్టోరి క్రెడిట్‌ను తాను వేసుకొంటానని అన్నాడు. అందుకు షాకై మీరెలా వేసుకొంటారు అని ప్రశ్నించాను. దాంతో నిన్ను చంపేస్తా అటూ బెదిరించాడు. విష్ణు తీరును వెంటనే మోహన్‌బాబుకు చెప్పాను. దాంతో ఆయన వాడు అలా చేయడం తప్పు.. నేను చూసుకొంటాను.. ఈ విషయాన్ని మరిచిపో అని నన్ను పంపించాడు. మోహన్ బాబుకు చెప్పాననే విషయంపై నపై కోపం పెంచుకొన్నారు. ఆ తర్వాత మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. చివరకు కథ ఇవ్వను.. స్క్రీన్ ప్లే ఇస్తానని చెప్పి టైటిల్‌లో ఆయన పేరు వేశాం అని కార్తీక్ రెడ్డి చెప్పారు.

     బౌన్సర్లతో బెదిరించి తప్పుడు అగ్రిమెంట్

    బౌన్సర్లతో బెదిరించి తప్పుడు అగ్రిమెంట్

    ఓటర్ సినిమా పూర్తయిన తర్వాత బయ్యర్లు రాకపోవడంతో ప్రొడ్యూసర్స్ ఆందోళనలో పడ్డారు. బిజినెస్ అయితే తప్ప సినిమాను విడుదల చేయలేమన్నారు. చివరకు ప్రొడ్యూసర్స్ చేతులెత్తేశారు. సినిమాను తాను రిలీజ్ చేస్తానంటూ మంచు విష్ణు ఓ ప్లాన్ వేశారు. తప్పుడు అగ్రిమెంట్‌పై స్క్రీన్ ప్లే కోసం రూ.1.5 కోట్లు ఇచ్చేలా బౌన్సర్లతో బెదిరించి బలవంతంగా నాతో సంతకం చేయించుకొన్నారు. డాక్యుమెంట్లు కూడా నాకు ఇవ్వకుండా నన్ను రకరకాలుగా మోసం చేశారు.

     మంచు ఫ్యామిలితో నాకు ప్రాణభయం

    మంచు ఫ్యామిలితో నాకు ప్రాణభయం

    ఓటరు సినిమాకు, అసెంబ్లీ రౌడీకి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి మానసిక వేదనల మధ్య ఈ లెటర్ రాస్తున్నాను. ఇక నుంచి నాకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా.. అందుకు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి బాధ్యులవుతారు. ఇలాంటి జరుగకుండా నాకు రక్షణ కల్పించాలని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్స్‌కు లేఖ రాస్తున్నాను అని కార్తీక్ రెడ్డి వెల్లడించారు.

    English summary
    Hero Manchu Vishnu landed fresh contraversy in Voter Movie rights. Director Karthik Reddy made serious allegations over Vishnu. He alleges that, Vishnu and His friend Vijay Kumar Reddy warned and made to sign on wrong agreement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X