విరూపాక్ష డైరెక్టర్‌కు చేదు అనుభవం.. ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం థియేటర్‌కు వెళితే ఘోరంగా!
ఈ మధ్య తెలుగు చిత్రసీమలో కొత్త దర్శకులు హవా కొనసాగుతుంది. చేస్తుంది మొదటి సినిమా అయినా ఎంతో పకడ్బందీగా తెరకెక్కించి యావత్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఈ ఏడాది దసరాతో శ్రీకాంత్ ఓదెల మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. విరూపాక్ష సినిమాతో కార్తీక్ వర్మ దండు సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఏ దర్శకుడికి అయినా తాను చేసిన తొలి సినిమాపై ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ చూపిస్తున్నారనే కుతుహులం ఉంటుంది. ఆ క్యూరియాసిటీతో థియేటర్ కు వెళ్లిన కార్తీక్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఫలితంగా తల పట్టుకోవాల్సి వచ్చింది.
డిఫరెంట్ పంథా:మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. కానీ ఈ సినిమా తర్వాత చేసిన పిల్లా నువ్వు లేని జీవితం మూవీ ముందుగా 2014లో విడుదలైంది. తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహరి, ప్రతిరోజూ పండగే వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెరీర్ లో ఎక్కువగా ఫ్లాప్స్ చూసిన సాయి డిఫరెంట్ పంథాలోనే సినిమాలు చేస్తున్నాడు.

15వ చిత్రంగా:ఇందులో భాగంగానే సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష. తేజ్ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా, ముద్దుగుమ్మ సోనియా సింగ్ ఫీమెల్ లీడ్ రోల్ చేసింది. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలైంది.
ఫ్యాన్స్ సంబురాలు:డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన విరూపాక్ష సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వస్తోంది. పాజిటివ్ రివ్యూలతోపాటు నటీనటులు, చిత్రబృందంపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా తమ అభినందనలు తెలిపారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ చేసిన తొలి మూవీ ఇది. దీంతో మెగా అభిమానులు, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.

ఆడియెన్స్ రియాక్షన్:సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాకు మంచి టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ రూ. 37 కోట్ల గ్లాస్, రూ. 20.82 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక తన తొలి చిత్రంపై ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందో చూద్దామని విరూపాక్ష విడుదలైన తొలి రోజున థియేటర్లోకి వెళ్లిన డైరెక్టర్ కార్తిక్ వర్మ దండుకు ఊహించని షాక్ తగిలింది.
పోన్, పర్సు మాయం:దర్శకుడు కార్తీక్ తోపాటు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని పలు థియేటర్లు చుట్టేశారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి దర్శకనిర్మాతలు ఇద్దరూ చాలా సంతోషించారు. కానీ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. థియేటర్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు మొబైల్ ఫొన్ ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. ఆయనతో పాటు వచ్చిన నిర్మాత పర్సును కూడా ఎవరో కాజేశారు.

ఏ థియేటర్లలో:థియేటర్ లో ఫోన్, పర్స్ పోవడంతో దర్శకనిర్మాతలు కార్తీక్, ప్రసాద్ తలపట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ఫోన్ దొరికిందా లేదా అనేది మాత్రం తెలియరాలేదు. అలాగే ఈ సంఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు కూడా అందలేదట. ఈ దర్శకనిర్మాతలు ఇద్దరూ ఐమాక్స్ తోపాటు, సంధ్య, శ్రీరాములు థియేటర్లకు వెళ్లారు. మరి ఆ ఫోన్, పర్సు ఎక్కడ పోయాయో తెలియదు.


Click it and Unblock the Notifications











