twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ..'డార్లింగ్‌' కల్పిత కథ కాదు..నిజం

    By Srikanya
    |

    'డార్లింగ్‌' కల్పిత కథ కాదు. 80 శాతం నిజమైన కథ ఇది. 30ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఈ కథ తయారు చేశాను అంటున్నారు దర్శకుడు కరుణాకరన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ రెండు వారాల క్రితం రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా ఆయన మీడియాను కలిసి మాట్లాడుతూ...ఇది పూర్తిగా ప్రభాస్‌ కోసం చేసిన కథే. ప్రభాస్‌ కి మంచి మాస్‌ హీరో ఇమేజ్‌ ఉంది. అందుకే తన స్టయిల్‌ని ఏ మాత్రం మిస్‌ కానివ్వకుండా..అలాగని నా స్టయిల్‌ కూడా మిస్‌ చేయకుండా ఈ కథ తయారు చేశాను. ఈ చిత్రం విడుదలైన తొలి రోజే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి వెళ్లి చూశాను. మేం ఎక్కడైతే ప్రేక్షకులు చప్పట్లు కొడతారని అనుకున్నామో సరిగ్గా ఆయా సన్నివేశాలకు వారి నుంచి మంచి స్పందన లభిస్తోంది. వాస్తవానికి ఈ కథ విన్నప్పుడు చాలా బాగుందని ప్రభాస్‌ చప్పట్లు కొట్టారు.

    ఇత 'డార్లింగ్‌'లో ప్రథమార్ధం కథ అంతా హీరో 'ఇమాజినేషన్‌'తో సాగుతుంది. అసలు కథ ద్వితీయార్ధంలో ఆరంభమవుతుంది. స్కీన్‌ ప్లే పరంగా ఇదో ప్రయోగంగా చెబుతాను. ఫస్టాఫ్‌ లో హీరోయిన్‌ తనను ప్రేమిస్తున్నట్లు హీరో ఓ ప్రేమ కథ అల్లుతాడు. అతను కథగా అల్లిన ఆ ప్రేమ సెకండాఫ్‌ లో నిజం అవుతుంది. ఈ కథలో ఉన్న కొత్తదనం ఇది.ఈ సినిమాకి స్వామి అందించిన సంభాషణలు, కెమెరామన్‌ ఆండ్రూ పనితనం, జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ప్లస్‌ అయ్యాయి. బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. అందుకే కథకు న్యాయం జరిగింది అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X