నాకు అమ్మ, నాన్న పవన్ కల్యాణ్.. జీవితాంతం రుణపడి ఉంటా.. తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. పవన్ కల్యాణ్ కెరీర్ ఆరంభంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలువడమే కాకుండా ఇండస్ట్రీలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. కీర్తీ రెడ్డి హీరోయిన్‌గా వాసుకి, నగేష్ నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి ప్రేమ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఈ సినిమాను జూన్ 30వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కరుణాకరన్ మాట్లాడుతూ..

దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. "వర్షం భూమ్మీద ఎక్కడైనా పడొచ్చు. కానీ సరైన చోటులో పడితేనే ఆ వాన చినుకులకు విలువ వస్తుంది. నా కథ అనేది కళ్యాణ్ గారి చేతిలో పడింది. అందువల్లే ఇంత పెద్ద హిట్ అయింది. నిర్మాత జీవీజీ రాజు గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నాను అని దర్శకుడు కరుణాకరన్ అన్నారు.

 Director Karunakaran

తొలి ప్రేమ అనే ఒక్క చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. నాకు తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. పవన్ కల్యాణ్ సినీ జీవితాన్ని ప్రసాదించారు. అందుకే నేను ఎప్పుడు ఎక్కడికెళ్లినా నా అమ్మనాన్న పవన్ కళ్యాణ్ అని చెబుతుంటాను. నా అన్నయ్య పవన్ కళ్యాణ్ వల్లే ఇంత పెద్ద హిట్ ఇవ్వడం జరిగింది. నా అన్నయ్యకి ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను అని కరుణాకరన్ అన్నారు.

పవన్ కల్యాణ్ నాకు అన్నయ్య లాంటి వాడు. ఆయన వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. ఆయనకు నేనెప్పుడు రుణపడి ఉంటాను. తొలిప్రేమ అనే స్క్రిప్టు పవన్ కల్యాణ్ చేతిలో పడింది. వాన చినుకు ఆలయంలో పడితే అది తీర్థం అవుతుంది. అలాగే పవన్ కల్యాణ్ చేతిలో తొలిప్రేమ స్క్రిప్టు పడి పెద్ద హిట్ అయింది అని కరుణాకరన్ అన్నారు.

 Director Karunakaran

తొలిప్రేమ రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి మాట్లాడుతూ.. తొలి ప్రేమ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతఙ్ఞతలు చెప్పుకోవాలి. ఈ సినిమాతోనే నా ప్రయాణం మొదలైంది. అప్పటికి నాకు ఆర్ట్ డైరెక్షన్ గురించి పెద్దగా తెలీదు. కానీ నువ్వు చేయగలవని కల్యాణ్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆరోజు కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వబట్టే.. ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను అని ఆనంద్ సాయి అన్నారు.

పవన్ కల్యాణ్ గారు లేకపోతే నేను గానీ, కరుణాకరన్ గారు గానీ ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ముందుగా వేరే పెద్ద ఆర్ట్ డైరెక్టర్‌ను అనుకున్నప్పటికీ, నాకు ఈ అవకాశమిచ్చి కరుణాకరన్ గారు, జీవీజీ రాజు గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్ వచ్చి తాజ్ మహల్ సెట్ వేయడం అంత తేలిక కాదు. నేను చేయగలనని నమ్మి అవకాశమిచ్చారు. ఈ సినిమా వల్లే నా కెరీర్ ఇంత బాగుంది. అలాగే వాసుకి కూడా నా జీవితంలోకి వచ్చింది అని ఆనంద్ సాయి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X