కూతురుతో సావిత్రికి ఆస్తి తగాదాలు, నగలు ఆమెకు దక్కకుండా అలా ప్లాన్ చేసిందట!

By Bojja Kumar

Recommended Video

Director Kethireddy Jagadishwar Reddy Reveals Sensational Facts About Savitri

'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాతో వార్తల్లోకి ఎక్కిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. 'మహానటి' చూసిన ఆయన సావిత్రి గురించి, ఆమె కూతురు విజయ చాముండేశ్వరి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సావిత్రి, చాముండేశ్వరి మధ్య ఉన్న ఆస్తి వివాదాల వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? వారి మధ్య ఎందుకు గొడవ జరిగింది? తన నగలు కూతురుకు దక్కకుండా సావిత్రి ఏం చేసిందనే వివరాలు బయట పెట్టారు.

12 ఏళ్ల వయసున్నపుడే సావిత్రితో పరిచయం

12 ఏళ్ల వయసున్నపుడే సావిత్రితో పరిచయం

నాకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడే సావిత్రితో పరిచయం ఉందని.... ‘మహానటి' సినిమా చూసిన తర్వాత మొదటి భాగంలో ఆమె జీవితంలోని యదార్ధ సంఘటనలు ఉన్నది ఉన్నట్లు చూపించారనే భావన కలిగిందని, సెకండాఫ్‌లో సినిమా జీవితానికి సంబంధించి చాలా వరకు కల్పితం ఉన్నట్లు తనకు అనిపించింది అన్నారు.

 సావిత్రి, విజయ చాముండేశ్వరి మధ్య ఆస్తి గొడవ

సావిత్రి, విజయ చాముండేశ్వరి మధ్య ఆస్తి గొడవ

నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చెన్నైలో సావిత్రి సొంత ఇంటికి వెళ్లడం జరిగేది. వెళ్లినపుడు కొన్ని సంఘటనలు నాకు తెలిసాయి. ఆ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సావిత్రి సినిమాల్లో సంపాదించిన డబ్బుతో తన కూతురు పేరు మీద కొన్ని ఆస్తులు కొనుగోలు చేసింది. ఆమె తాగుడుకు బానిసై తర్వాత ఆస్తులన్నీ పోయాయి. చివరకు చాముండేశ్వరి పేరు మీద ఉన్న ఆస్తి కూడా అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే అప్పటికే పెళ్లయిన విజయ చాముండేశ్వరి, ఆమె భర్త గోవిందరావు ఆ ఆస్తిని అమ్మడానికి నిరాకరించారు. దీంతో సావిత్రి, విజయ చాముండేశ్వరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని కేతిరెడ్డి తెలిపారు.

అందుకే కూతురు మీద కోపం పెంచుకుంది

అందుకే కూతురు మీద కోపం పెంచుకుంది

సావిత్రి ఆ రోజుల్లో తనకు నచ్చని పని ఎవరు చేసినా సహించని మనస్తత్వం. తాను అమ్మాలనుకున్న ఆస్తి అమ్మనివ్వలేదని సొంత కూతురు మీద కూడా కోపం పెంచుకుంది.... అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

తన నగలు కూతురుకు దక్కకుండా చేసింది

తన నగలు కూతురుకు దక్కకుండా చేసింది

ఆ రోజుల్లో సావిత్రి వద్ద చాలా నగలు ఉండేవి. కూతురుతో గొడవ తర్వాత తన నగలు విజయ చాముండేశ్వరికి దక్కకుండా ఉండాలని వాటిని తనకు చాలా సన్నిహితంగా ఉండే సినీ నటులు, తాను శ్రేయోభిలాషులుగా నమ్మిన వారి వద్ద దాచింది. సావిత్రి కోమాలోకి వెళ్లిన తర్వాత వారెవరూ కూడా ఆ నగలు తిరిగి ఇవ్వలేదు అని..... అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

 వారిద్దరి మధ్య ఆ గొడవ తప్ప ఏమీ లేదు

వారిద్దరి మధ్య ఆ గొడవ తప్ప ఏమీ లేదు

తాగుడుకు బానిసై తప్పుడు మార్గంలో వెళుతున్న తల్లి ఆస్తులన్నీ అమ్ముతుంటే విజయ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తల్లీ కూతుళ్ల మధ్య గొడవలు వచ్చాయి తప్ప... వారి మధ్య ఇతర ఏ గొడవలు లేవు అని కేతిరెడ్డి తెలిపారు.

అందుకే ఆస్తి అమ్మనివ్వలేదు

అందుకే ఆస్తి అమ్మనివ్వలేదు

అప్పటికే విజయ చాముండేశ్వరికి గోవిందరావు అనే వ్యక్తితో పెళ్లి జరిగి పిల్లలుకూడా ఉన్నారు. తన పేరు మీద ఉన్న ఆస్తి అమ్మితే మేము ఎలా బ్రతికాలనే ఉద్దేశ్యంతోనే ఆమె తల్లి నిర్ణయానికి అడ్డుపడింది అని కేతిరెడ్డి తెలిపారు.

తమ్ముడితో ఆస్తి పంపకాలు

తమ్ముడితో ఆస్తి పంపకాలు

తర్వాత తమ్ముడు సతీష్‌తో ఎలాంటి గొడవలు లేకుండా విజయ చాముండేశ్వరి ఆస్తి పంపకాలు జరుపుకున్నారు. అందరూ ఇపుడు ఎంతో బాగా కలిసి ఉంటున్నారు అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

 ఇది బయోపిక్ కాదు

ఇది బయోపిక్ కాదు

‘మహానటి' చిత్రాన్ని బయోపిక్ అని అనలేం. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు చూపించలేదు. చాలా వరకు కల్పితంగా ఉన్నాయి అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X