NTR30: ఎన్టీఆర్ మూవీ స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. మనుషులు కాదు మృగాలతో.. ఇండియాలోనే తొలి సినిమాగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఏకధాటిగా ఆరు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్.. తన ముప్పైవ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ.. ఎన్టీఆర్‌తో చేసే సినిమా స్టోరీలైన్‌ను రివీల్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసమే!

కొరటాల శివతో ఎన్టీఆర్ మూవీ

కొరటాల శివతో ఎన్టీఆర్ మూవీ


RRR సినిమా షూట్ జరుగుతోన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

గ్రాండ్‌గా పూజ ఈవెంట్ పూర్తి

గ్రాండ్‌గా పూజ ఈవెంట్ పూర్తి

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా హైదరాబాద్‌లో జరిపారు. సరిగ్గా ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ముందుగా నిర్మాతలు నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో పూజారి దేవుడి చిత్ర పటాలకు పలు పూజలు చేశారు.

జాన్వీ హైలైట్.. సెలెబ్రిటీలు

RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల కోసం చిత్ర యూనిట్ సభ్యులు జాన్వీ కపూర్, అనిరుథ్ రవిచందర్, సాబు సిరిల్, రత్నవేలుతో పాటు టాలీవుడ్‌లోని సినీ ప్రముఖులు చాలా మంది విచ్చేశారు. అందులో రాజమౌళి, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, ప్రశాంత్ నీల్‌, దిల్ రాజు, బాపినీడు, కేఎస్ రామారావు, శ్యాం ప్రసాద్ రెడ్డి, నాగ వంశీ తదితరులు ఉన్నారు.

ఇద్దరు డైరెక్టర్లతో మూవీ స్టార్ట్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే స్క్రిప్టును శ్యాం ప్రసాద్ రెడ్డి చిత్ర యూనిట్‌కు అందించారు. ఆ తర్వాత హీరో హీరోయిన్లపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. దీంతో ఈ వేడుక ఎంతో గ్రాండ్‌గా ముగిసింది.

కొరటాల స్పీచ్.. ఆ స్టోరీలైన్‌

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అంతేకాదు, ఈ చిత్రం ఇండియాలో ఎవరూ చూడని కోస్టల్ ఏరియా (సముద్ర భాగం)కు సంబంధించిన బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని చెప్పారు.

మనుషుల కంటే మృగాలే

ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన మెయిన్ పాయింట్‌ను రివీల్ చేసేశారు. 'ఈ కథలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా కనిపిస్తాయి. వాటికి దేవుడు అంటే భయం ఉండదు.. చావంటే భయం ఉండదు. కానీ, ఒకే ఒకటి అంటే భయం. ఆ భయం ఏంటో మీకు కూడా తెలుసు' అంటూ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ తీరును వెల్లడించారు.

ఇండియాలోనే తొలి మూవీ

ఇండియాలోనే తొలి మూవీ


గతంలో ఇండియాలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో కొన్ని చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ చిత్రం మాత్రం వాటికి మించేలా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. అంతేకాదు, ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని కొరటాల స్పష్టం చేశారు. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X