ఐదేళ్ల తర్వాత గుడ్‌బై.. కొరటాల శివ సంచలన నిర్ణయం.. కారణం అదేనా?

వరుస విజయాలతో సక్సెస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న కొరటాల శివ తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. త్వరలోనే దర్శకత్వ పనుల నుంచి రిటైర్ తీసుకొంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆయన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ..

కొరటాల శివ కరోనా సాయం

కొరటాల శివ కరోనా సాయం

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సినీ పరిశ్రమలన్నీ స్తంభించాయి. వేలాది మంది రోజువారీ వేతన కార్మికులు పని, డబ్బు లేక ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా స్పందించి వారిని ఆదుకోనేందుకు కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేశారు. చిరంజీవి నేతృత్వంలో సాగుతున్న ఈ స్వచ్ఛంద సంస్థకు తన వంతుగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని కొరటాల ప్రకటించారు.

ఆచార్య షూటింగ్‌తో బిజీగా

ఆచార్య షూటింగ్‌తో బిజీగా


ఆచార్య సినిమా గురించి తెలియజేస్తూ.. ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా రాంచరణ్ పాత్ర మొదలు కాలేదు. ఆయనకు జోడిగా హీరోయిన్‌ కోసం వెతుకుతున్నాం. రాంచరణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. త్వరలోనే ఆ పాత్ర చిత్రీకరణ మొదలవుతుంది అని కొరటాలశివ పేర్కొన్నారు.

ఐదేళ్ల తర్వాత రిటైర్మెంట్

ఐదేళ్ల తర్వాత రిటైర్మెంట్

సినిమా పరిశ్రమలో పనిచేయడం ఒత్తిడితో కూడుకొన్న పని. దర్శకత్వం బాధ్యతలు అనేవి చాలా ఒత్తిడితో కూడుకున్నవి. ఎక్కువ కాలం ఆ ఒత్తిడిని భరించలేను. మరో ఐదేళ్ల తర్వాత నేను డైరెక్టర్‌గా తప్పుకొంటాను. నా మైండ్‌లో ఉన్నవి.. నేను తీయాలనుకొన్న సినిమాలు తీసి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటాను అని కొరటాల శివ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Recommended Video

#HappyBirthdayAlluArjun: Allu Arjun Special Gift To Fans
ఆచార్య మూవీ గురించి

ఆచార్య మూవీ గురించి


ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి రాంచరణ్ నిర్మిస్తున్నారు అని కొరటాల పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నారు ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సోను సూద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విద్యావ్యవస్థ బ్యాక్‌డ్రాప్‌గా ఈ సినిమా రూపొందుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X