పవన్ కళ్యాణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కొరటాల.. గతంలోనే అనుకున్నాను అంటూ..
మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ఆ తర్వాత బాక్సాఫీస్ విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ దర్శకుల లిస్టులో చేరిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడు కూడా రాజమౌళి తరహాలోనే వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నాడు. మంచి కథాంశాలతో సందేశాలను అందిస్తూ ప్రముఖుల ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇక ఎంతో సామాజిక బాధ్యత ఉండే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే బాగుంటుంది అని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కొరటాల శివ పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా ఎప్పుడైనా అనుకున్నారా? అనే విషయంపై కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస విజయాలు
దర్శకుడు కొరటాల శివ మిర్చి సినిమాను ఒక డిఫరెంట్ మాస్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ప్రభాస్ మొదటిసారిగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రికార్డును అందుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు సినిమా కూడా మంచి వసూళ్లను అందించడమే కాకుండా ప్రేక్షకులకు కూడా ఒక మంచి సందేశాన్ని కూడా అందించింది.

చాలామంది హీరోలు..
ఇక జనతాగ్యారేజ్ భరత్ అనే నేను సినిమాలో కూడా కొరటాల శివ తనదైన శైలిలో మంచి సందేశాలు అంధించాడు. అందుకే ఈ దర్శకుడితో సినిమా చేయాలని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు అయితే కొరటాల శివ తో ఎప్పుడు అయినా సరే సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ రేంజ్ లో ఈ దర్శకుడు మంచి గుర్తింపు పొందుతున్నాడు.

మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగా
ఇక కొరటాల శివ ఆచార్య సినిమా కంటే ముందే రామ్ చరణ్ తో ఒక సోలో సినిమా చేయాలి అని అనుకున్నాడు. కానీ అప్పుడు రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బిజీ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టంగా మారి పోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ చేయడంతో ఆయన తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగా ఒక మంచి సందేశం తో యాక్షన్ కథను రూపొందించిన కొరటాల శివ అందులో ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం ఒక పాత్రను పొందుపరచడం విశేషం.

పవన్ కళ్యాణ్ తో..
ఇక ఆచార్య సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొరటాల శివ తో ఒక మంచి సందేశాత్మకమైన చిత్రం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు.

గతంలో ఓ కథ..
కొరటాల శివ కూడా గతంలో పవన్ కళ్యాణ్ కోసం కూడా మంచి సినిమా చేయాలని అనుకున్నాడట. దర్శకుడు కాక ముందుకే శ్రీమంతుడు తరహాలో పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి పాయింట్ కూడా అనుకున్నట్లు చెప్పాడు. సమయం కుదిరితే మాత్రం తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానని కూడా కొరటాల శివ తెలియజేశాడు. ఇక ఈ కలయికలో సినిమా రావాలని మెగా ప్రేక్షకులు ఎంతో బలంగా కోరుకుంటున్నారు


Click it and Unblock the Notifications











