twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందా.. గుట్కా వేసుకుని వస్తుంటే భయం వేసింది.. కొరటాల శివ!

    |

    Recommended Video

    Director Koratala Siva Speech at Majili Movie Grand Thanks Meet || Filmibeat Telugu

    నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత శుక్రవారం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇచ్చారు.పాజిటివ్ టాక్ తో మజిలీ నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల దిశగా దుసుకుపోతోంది. మజిలీ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

     భరత్ అనే నేను చేస్తున్నప్పుడు

    భరత్ అనే నేను చేస్తున్నప్పుడు

    కొరటాల శివ మాట్లాడుతూ.. మజిలీ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. తాను భరత్ అనే నేను చిత్రం చేస్తున్న సమయంలో మొదటిసారి శివ నిర్వాణని కలిసినట్లు కొరటాల శివ తెలిపారు. దానయ్య శివ నిర్వాణని తనకు పరిచయం చేశాడని కొరటాల తెలిపారు. అప్పుడే మజిలీ చిత్రం గురించి విన్నా. కథ చాలా బావుందని చెప్పా. సినిమా అంటే నేల మీద ఉండాలి. అలంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి అని కొరటాల శివ తెలిపారు.

     అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందా

    అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందా

    శివ నిర్వాణని చూస్తుంటే.. ఆయన్ని ఎవరైనా అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. అలా జరిగి ఉంటేనే ఇలాంటి మంచి ఫీల్ తో సినిమాలు వస్తాయని కొరటాల చమత్కరించారు. నిజంగా శివ నిర్వాణని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయి ఉంటేనే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మజిలీ లాంటి మంచి చిత్రాలు వస్తాయని కొరటాల శివ అన్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్ర తనకు గుర్తుండిపోయింది కొరటాల ప్రశంసించారు. నాగ చైతన్యకు స్నేహితులుగా నటించిన వారంతా నిజంగా వైజాగ్ రైల్వే కాలనిలో ఉన్నారా అనిపించేలా నటించారని కొరటాల తెలిపారు.

    బలహీనతలు తెలుసు

    బలహీనతలు తెలుసు

    నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. చైతు ప్రతి చిత్రంలో గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారని తెలిపారు. నాగ చైతన్యని ఎప్పుడు చూసినా చాలా నిజాయతీగా కనిపిస్తారు. తన బలమేంటో, బలహీనతలేంటో చైతుకు బాగా తెలుసు అని కొరటాల శివ అన్నారు. రావు రమేష్, పోసాని కృష్ణ మురళి ఎప్పటిలాగే అద్భుతంగా నటించారని కొరటాల అన్నారు. తాము ఒక్కోసారి చాలా చిన్న మాటలు రాస్తుంటాం. పోసాని, రావు రమేష్ లాంటి నటుల వలన ఆ మాటాకు మంరింత విలువ వస్తుందని కొరటాల తెలిపారు.

    గుట్కా సన్నివేశం

    గుట్కా సన్నివేశం

    కొరటాల శివ ఓ సన్నివేశం గురించి నాగచైతన్యని ప్రత్యేకంగా అభినందించారు. చైతు గుట్కావేసుకుని, బ్యాట్ పట్టుకుని వస్తుంటే నాకు భయం వేసింది. చైతు ఏంటి ఇంత బ్యాడ్ బాయ్ లాగా మారిపోయాడు అని అనుకున్నా. నిజంగా అది అద్భుతమైన పెర్ఫామెన్స్ అని కొరటాల శివ ప్రశంసించారు. సమంత, చైతు మధ్య కెమిస్ట్రీ మరోమారు హైలైట్ గా నిలిచిందని కొరటాల అన్నారు.

    English summary
    Director Koratala Siva Speech at Majili Movie Grand Thanks Meet. Shiva Nirvana is the director of Majili. Rao Ramesh and Posani playing key roles in Majili
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X