పవన్ కళ్యాణ్ కోసం కథ, 100 కోట్ల బడ్జెట్.. కానీ కుదర్లేదు, విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు!

Recommended Video

Kovera Plans 100 Cr Budget Movie For Pawan Kalyan | FilmiBeat Telugu

చిన్న చిత్రాలు విడుదల సమయంలో ఎలాంటి హడావిడి కనిపించదు. కానీ ఆ చిత్రాలు విజయం సాధిస్తే మాత్రం అందరూ చర్చించుకుంటారు. చిన్న చిత్రాలుగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రాలు ఇటీవల చాలానే ఉన్నాయి. ప్రేక్షకులని మెప్పించే కథ ఉంటె చాలు.. ఆ చిత్రానికి బ్రహ్మరథం పడుతారు. నూతన దర్శకుడు కోవెర తెరకెక్కించిన చిత్రం 'యు'. ఈ చిత్రంలో కోవెరే హీరోగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కోవెర ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

 విజయేంద్ర ప్రసాద్ శిష్యుడిగా

విజయేంద్ర ప్రసాద్ శిష్యుడిగా

కోవెర మాట్లాడుతూ తాను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ శిష్యుడిగా నాలుగేళ్లు పనిచేశా. ఆ అనుభవంతోనే యూ చిత్ర కథని రూపొందించుకున్నా అని కోవెర అన్నారు. ఓ గ్రామంలో మొదలైన కథ అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది అని తెలిపారు. భారత సినిమా చరిత్రలో ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు. కథలోని కాన్సెప్ట్ చాలా ఆసక్తిగా ఉంటుందని కోవెర తెలిపాడు.

పవన్ కళ్యాణ్ కోసం

పవన్ కళ్యాణ్ కోసం

తాను వాస్తవానికి ఈ కథని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నా. 100 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించాలని కూడా నిర్ణయించుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ చిత్రం తెరకెక్కించడం కుదర్లేదు అని కోవెర తెలిపారు. ఈ కథ విన్న ప్రముఖ నటులు శుభలేఖ సుధాకర్,, తనికెళ్ళ భరణి ఎంతగానో తనని ప్రోత్సహించారని కోవెర తెలిపాడు. పవన్ హీరోగా నటించాల్సిన సినిమాలో నేను నటించాల్సి వచ్చింది. దీనితో కేవలం కోటి బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం అని కోవెర తెలిపాడు.

తొలిసారి

తొలిసారి

హీలియం 8కె కెమెరాతో తెరకెక్కించిన తొలి ఇండియన్ మూవీ యు అని కోవెర తెలిపారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల సుకుమార్ చేతుల మీదుగా లాంచ్ అయింది. శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. దర్శకుడు మంచి పాత్రలో కథ సిద్ధం చేసుకుని నా వద్దకు వచ్చారు అని తెలిపారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. మొదట ఈ కథని శుభలేఖ సుధాకర్ విని నా వద్దకు పంపారని అన్నారు. ఏఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

విడుదలకు రెడీ

విడుదలకు రెడీ

డిసెంబర్ 14న కోవెర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కోవెరా క్రియేషన్స్ బ్యానర్ పై కొండా విజయలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. హిమన్షి, స్వప్నా రావు హీరోయిన్లుగా నటించారు. సత్య మహావీర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X