మెగా హీరోలందరితో మల్టీస్టారర్.. కథను సిద్ధం చేసిన యువ హీరో: క్లారిటీ ఇచ్చిన క్రిష్

మెగా ఫ్యామిలీ అందరూ కలిసి మనం లాంటి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహలకు కూడా అందడం లేదు కదా. అయితే వారందరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అని ఎంతోమంది అభిమానులు కూడా అనుకోని ఉండి ఉంటారు. కానీ వారందరికీ సరిపోయే కథను తయారు చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ప్రతి విషయంలో కూడా ఎంతగానో ఆలోచించాలి.

ఒకవైపు మెగాస్టార్ మరోవైపు పవర్ స్టార్ ని మ్యానేజ్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. స్టార్ వాల్యూస్ ని దృష్టిలో ఉంచుకొని డైరెక్షన్ చేస్తూ ఉండాలి. అయితే ఒక యువ హీరో మెగా ఫ్యామిలీ మొత్తం ఉండేలా ఒక కథను తయారు చేశాడట. ఆ హీరో కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వారే కావడం విశేషం. ఇటీవల దర్శకుడు క్రిష్ అతని గురించి వివరణ ఇచ్చాడు.

మెగా హీరోలతో ఒకేసారి రెండు సినిమాలు

మెగా హీరోలతో ఒకేసారి రెండు సినిమాలు

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం కొండపొలం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ విభిన్నమైన సినిమా పై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమళ్లు అనే సినిమాను కూడా చేస్తున్నాడు. 17వ శతాబ్దం కాలం నాటి అంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక రాబిన్ హుడ్ పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

మెగా మల్టీస్టారర్ కథ

మెగా మల్టీస్టారర్ కథ

అయితే ఇటీవల ఈ దర్శకుడికి మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించేలా ఒక యువ హీరో కథను చెప్పినట్లు తెలియజేశాడు. ఇక హీరో మరెవరో కాదు మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ తేజ్ అని ఇంటర్వ్యూలో తెలియజేశారు. వైష్ణవ్ తేజ్ కు కథలు రాయడం అంటే కూడా చాలా ఇష్టం అని చాలా సార్లు చెప్పాడు. అయితే అతను మెగా ఫ్యామిలీ అందరూ కలిసి నటించే విధంగా ఒక మంచి కథని రాసుకున్నాడు అని చెప్పాడు.

అతని నుంచి చాలా నేర్చుకోవాలి

అతని నుంచి చాలా నేర్చుకోవాలి

వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాదుతూ.. అతని పనితనం చాలా బాగుంటుంది. ఒక నటుడిగా తనకి మంచి భవిష్యత్తు కూడా ఉంది. చాలా సింపుల్ గా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. పెద్ద వాళ్లతో కాకుండా చిన్న వాళ్లతో కూడా ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటాడు. స్థాయిని బట్టి కాకుండా ఎదుటి మనిషిని బట్టి గౌరవం ఇస్తాడు. ఒక దర్శకుడితో అలాగే లైట్ మెన్ తో కూడా సమానమైన మర్యాద తో మాట్లాడుతాడు ఉంటాడు. అతని నుంచి చాలా నేర్చుకోవాలి అని క్రిష్ తెలియజేశారు

టైటిల్ కూడా సెట్ చేసుకున్నాడు

టైటిల్ కూడా సెట్ చేసుకున్నాడు

అయితే వైష్ణవ్ తేజ్ కు కథలు రాయడం కూడా చాలా ఇష్టమే అని నాకు చాలా సార్లు చెప్పాడు. ఒకసారి మెగా ఫ్యామిలీ అందరికోసం కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మంచి కథను రాశాడు. ఆ కథను నాతో పలుసార్లు చర్చించారు. అంతేకాకుండా ఒక టైటిల్ కూడా సెట్ చేసుకున్నాడు. అయితే అతన్ని మాత్రం నాకు మంచి నటుడిగా చూడాలని ఉందని దర్శకుడు వివరణ ఇచ్చారు. కొండపొలం సినిమాలో వైష్ణవ్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని గొర్రెల కాపరిగా పాత్రలో జీవించి పోయినట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X