40 ఏళ్ల క్రితం తండ్రి చేసినట్లే.. అదరగొట్టేసిన బాలయ్య.. క్రిష్ కోసం స్పెషల్‌గా!

Recommended Video

Director Krish BirthDay Special Working Stills From NTR Biopic | Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలయ్య నటిస్తునడంతో ఈ చిత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్స్ లో బాలయ్య ఎన్టీఆర్ ని మురిపించేలా కనిపిస్తన్నాడు. తండ్రి పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనతో చిత్ర యూనిట్ సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్లు తెలుస్తోంది.

40 ఏళ్ల క్రితం

40 ఏళ్ల క్రితం

ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో 40 ఏళ్ల క్రితం బొబ్బిలి పులి చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబందించిన సన్నివేశాల్లో బాలయ్య నటిస్తున్నాడు. మాస్ జనాల్లో ఈ చిత్రంతో ఎన్టీఆర్ క్రేజ్ ఇంతా పెరిగింది.

సింగిల్ టేక్

సింగిల్ టేక్

ఈ చిత్రంలో ఓ భారీ డైలాగ్ ని బాలయ్య సింగిల్ టేక్ లో అనర్గళంగా చెప్పేశాడట.సెట్స్ లోని వారంతా బాలయ్య చూస్తూ ఎన్టీఆర్ ని గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా బొబ్బిలి పులి షూటింగ్ లో ఈ డైలాన్గ్ ని సింగిల్ టేక్ లో ఫినిష్ చేసారు. తన తండ్రి చరిత్రని ఏ విధంగా బాలయ్య రిపీట్ చేశాడు.

 క్రిష్ బర్త్ డే

క్రిష్ బర్త్ డే

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో క్రిష్ షూటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఏ చిత్రంలో నటించే నటీనటుల పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిష్ బర్త్ డే కోసం బాలయ్య స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

వర్కింగ్ స్టిల్స్

వర్కింగ్ స్టిల్స్

క్రిష్ షూటింగ్ లో బాలయ్యతో బిజీగా గడుపుతున్న వర్కింగ్ స్టిల్స్ ని నిన్నటి నుంచి విడుదల చేస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని క్రిష్ దగ్గరుండి చేయించడం ఈ వర్కింగ్ స్టిల్స్ ద్వారా అర్థం అవుతోంది. ఎన్టీఆర్ పొలిటికల్ స్పీచ్, గుండమ్మ కథ చిత్రంలో నిత్యామీనన్ తో వచ్చే సన్నివేశాలు ఇలా క్రిష్ ఉన్న పలు వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X