ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి.. చీకట్లో బాణాలు వేస్తున్నారు: క్రిష్ సంచలన వ్యాఖ్యలు

మణికర్ణిక సినిమా విషయమై డైరెక్టర్ క్రిష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మణికర్ణిక సినిమా విషయంలో స్పందించడం ఇష్టం లేదంటూనే చీకట్లో బాణాలు బాణాలు వేస్తున్నారంటూ క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఇటీవలే విడుదలై భారీ సక్సెస్ సాధించిన మణికర్ణిక సినిమా విషయంలో డైరెక్టర్ క్రిష్, హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో మణికర్ణిక సినిమాకు సంబంధించి దాదాపు 70 శాతం షూటింగ్ ఫినిష్ చేసిన క్రిష్ ఆ తరువాత తప్పుకున్నారు. మిగితా భాగానికి కంగనానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. ఇక సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో టైటిల్ క్రెడిట్ విషయమై కంగనా, క్రిష్ మధ్యలో పెద్ద మెటల్ యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశానికి హాజరైన క్రిష్‌ని.. ఈ ఇష్యు గురించిన ప్రశ్నలు అడిగారు మీడియా ప్రతినిధులు.

Director Krish coment on Manikarnika movie

అయితే మొదట ఈ వివాదంపై స్పందించేందుకు ఇష్ట పాడనీ క్రిష్.. ఆ తర్వాత మాత్రం తాను వారికి గుడ్ లక్ మాత్రమే చెప్పగలనని అన్నారు. ప్రస్తుతం తాను తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టలేదని, తాను ఎప్పుడు తప్పటడుగు వేస్తానా అని కొందరు పనిగట్టుకు చూస్తున్నారని క్రిష్ పేర్కొనడం చర్చనీయాంశం అయింది. అంతేగాకుండా ఇక నుంచి తాను చాలా జాగ్రత్తగా ఉండదలచుకున్నానని అన్నారు క్రిష్. కొందరు చీకట్లో బాణాలు విసురుతూ అవి తనకు తగులు తాయేమో అనే భ్రమలో ఉన్నారంటూ క్రిష్ సంచలనంగా మాట్లాడటంతో అంతా షాక్ అయ్యారు.

ఇక క్రిష్ సినిమాల విషయానికొస్తే.. మణికర్ణిక నుంచి తప్పుకున్నాక బాలయ్య బాబు హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు భాగాలుగా తెరకెక్కించారు క్రిష్. అయితే ఈ సినిమా ఊహించిన విజయం సాధించక పోవడంతో కాస్త నిరాశ చెందారు ఎన్టీఆర్ యూనిట్ అంతా. ఈ చిత్రంలో బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్, రానా, రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X