twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రిష్ కి బాలీవుడ్ గోల్డెన్ ఛాన్స్...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు క్రిష్ కి ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. భారీ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందారాయన. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాత. ఈ చిత్రానికి 'గబ్బర్‌' అనే టైటిల్ ని ఖరారు చేశారు.

    ఇది తెలుగులో వచ్చిన 'ఠాగూర్‌' ఆధారంగా రూపొందబోతోంది. చిరంజీవి నటించిన 'ఠాగూర్‌'కి మాతృక తమిళ చిత్రం 'రమణ'. ఈ సినిమాపై గత కొంతకాలంగా హిందీ హీరోలు, దర్శకులు ఆసక్తి చూపించారు. భన్సాలీ హక్కులు పొందారు. ఈ చిత్రానికి ఓ దశలో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారనీ వార్తలొచ్చాయి. అవకాశం మాత్రం క్రిష్‌కి దక్కింది.

    ఈ సందర్భంగా క్రిష్ మీడియాతో మాట్లాడుతూ ''భన్సాలీది దర్శకుడిగా ప్రత్యేక స్థానం. ఆయన నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా, వర్తమాన పరిస్థితులకు తగ్గట్టు కథ, కథనాల్లో మార్పులుచేర్పులుంటాయి''అన్నారు. నవంబరులో షూటింగ్ మొదలవుతుంది.

    ఇక రీసెంట్ గా అక్షయ్ కుమార్ తెలుగులో హిట్టైన విక్రమార్కుడు చిత్రాన్ని..రౌడీ రాథోడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆ చిత్రాన్ని సైతం సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. వందకోట్లు దాటి రౌడీ రాథోడ్ కలెక్షన్స్ వర్షం కురిపించింది. అదే ఊపులో ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

    English summary
    Director Krish who made debut with critically acclaimed Gamyam is now testing his luck in Bollywood. Krish will be directing a film titled Gabbar with Akshay Kumar. The film is remake of Tamil hit Ramana, which was also successfully remade in Telugu Tagore starring Chiranjeevi. Bollywood producers Sanjay Leela Bhansali and Sabhina Khan offered him the chance to remake the Tagore in Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X