Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రిష్ కి బాలీవుడ్ గోల్డెన్ ఛాన్స్...డిటేల్స్
ఇది తెలుగులో వచ్చిన 'ఠాగూర్' ఆధారంగా రూపొందబోతోంది. చిరంజీవి నటించిన 'ఠాగూర్'కి మాతృక తమిళ చిత్రం 'రమణ'. ఈ సినిమాపై గత కొంతకాలంగా హిందీ హీరోలు, దర్శకులు ఆసక్తి చూపించారు. భన్సాలీ హక్కులు పొందారు. ఈ చిత్రానికి ఓ దశలో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారనీ వార్తలొచ్చాయి. అవకాశం మాత్రం క్రిష్‌కి దక్కింది.
ఈ సందర్భంగా క్రిష్ మీడియాతో మాట్లాడుతూ ''భన్సాలీది దర్శకుడిగా ప్రత్యేక స్థానం. ఆయన నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా, వర్తమాన పరిస్థితులకు తగ్గట్టు కథ, కథనాల్లో మార్పులుచేర్పులుంటాయి''అన్నారు. నవంబరులో షూటింగ్ మొదలవుతుంది.
ఇక రీసెంట్ గా అక్షయ్ కుమార్ తెలుగులో హిట్టైన విక్రమార్కుడు చిత్రాన్ని..రౌడీ రాథోడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆ చిత్రాన్ని సైతం సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. వందకోట్లు దాటి రౌడీ రాథోడ్ కలెక్షన్స్ వర్షం కురిపించింది. అదే ఊపులో ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.