twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటికి వెళ్లనంటూ ఏడ్చాడు.. చెప్పలేని పరిస్థితి.. డైరెక్టర్ క్రిష్‌తో నాని!

    |

    నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం ఏప్రిల్ 19న విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది నానికి పెద్దగా కలసి రాలేదు. నానికి అర్జెంట్ గా హిట్ అవసరం అన్న తరుణంలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయం దిశగా పయనిస్తోంది. అవెంజర్స్,కాంచన 3 లాంటి చిత్రాల పోటీని తట్టుకుని కూడా జెర్సీ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇదిలా ఉండగా విడుదల తర్వాత కూడా జెర్సీ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తాజాగా నానిని, జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని ప్రముఖ దర్శకుడు క్రిష్ ఇంటర్వ్యూ చేశారు.

     నమ్మలేని విధంగా

    నమ్మలేని విధంగా

    క్రిష్ మాట్లాడుతూ.. ఓ రోజు తాను, అన్ని ఇళయరాజా పాటలు వింటూ కూర్చున్నాం. కథ చెప్పలేదు కానీ జెర్సీ చిత్రం గురించి ఒక రేంజ్ లో చెప్పాడు. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు అని క్రిష్ తెలిపాడు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత.. ఇదేదో నాని చెప్పిన మాటలు నిజమయ్యేలా ఉన్నాయే అని అనుకున్నానని తెలిపారు. తొలి షోని అందరితో కలసి నేను కూడా చూశా. థియేటర్ లో అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు అని క్రిష్ ప్రశంసించారు.

    మొక్కుబడిగా కాదు

    మొక్కుబడిగా కాదు

    నాని మాట్లాడుతూ జెర్సీ చిత్రానికి చాలా మంది సెలెబ్రిటీల నుంచి ప్రశంసలు దక్కాయి. అందరూ సినిమా బాగుంది కదా ఓ ట్వీట్ చేద్దాం అని మొక్కుబడిగా కాకుండా మనసులో అనిపించిన ఫీలింగ్ ని బయట పెట్టారు అని నాని తెలిపాడు. ఇంత మంచి కథని తయారు చేసుకోవడం గౌతమ్ క్రెడిట్ అయితే.. ఆ కథ స్థాయిని పెంచేలా నటించడం నానికి దక్కే క్రెడిట్ అని క్రిష్ తెలిపారు.

    చెప్పలేని పరిస్థితి

    చెప్పలేని పరిస్థితి

    గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ.. షూటింగ్ దశలో చాలా ఇబ్బందిగా అనిపించింది. హీరోకి ఏదో సమస్య ఉన్నట్లు అనిపించాలి.. కానీ అదేంటో తెలియకుండా నటించాలి. ఇలా అడిగితే ఎవరైనా గందరగోళానికి గురవుతారు. నానికి ఎలా చేయాలో చెప్పలేని పరిస్థితి నాది అని గౌతమ్ అన్నాడు. కానీ నాని మాత్రం అద్భుతంగా నటించాడని గౌతమ్ ప్రశంసించాడు. ఇక రైల్వే స్టేషన్ సీన్ స్క్రిప్ట్ లో కేవలం ఒక పేరా మాత్రమే ఉంది. దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ అదే సన్నివేశం ఇప్పుడు హైలైట్ గా నిలిచింది అని గౌతమ్ తెలిపాడు.

     ఇంటికి వెళ్లనంటూ ఏడ్చేశాడు

    ఇంటికి వెళ్లనంటూ ఏడ్చేశాడు

    ఇక నాని ఈ చిత్రంలో తన కొడుకుని కొట్టే సన్నివేశం అంతబాగా రావడానికి సూర్యుడు కూడా ఓ కారణం అని గౌతమ్ తెలిపాడు. నాని కొడుకుగా నటించిన రోహిత్ ఆ సన్నివేశంలో అద్భుతమైన హావభావాలు వ్యక్తపరిచారు. మేము కెమెరా పెట్టిన యాంగిల్ లో సూర్యుడి కిరణాలు కూడా పడుతున్నాయి. దీనితో రోహిత్ కెమెరా వంక చూడలేకపోయాడు. ఎలాగోలా 10 సెకండ్ల పాటు కెమెరాని చూడు అని చెప్పాం. సూర్యుడి కిరణాలు కంట్లో పడడం వల్ల వాడు కాస్త వణుకుతూ కనిపించాడు. అది ఆ సన్నివేశానికి బాగా కుదిరిందని గౌతమ్ తెలిపాడు. జెర్సీ షూటింగ్ ముగిశాక మమ్మల్ని వదిలి రోహిత్ వెళ్లలేక పోయాడు. ఇంటికి వెళ్లనంటూ ఏడ్చేశాడు అని నాని తెలిపాడు.

    English summary
    Director Krish interview with Nani and Gawtam Tinnanuri. Gawtam Tinnanuri is director of movie. Shraddha Srinath plays female lead
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X