ఈసారి హీరోను చంపను..దర్శకుడు క్రిష్
దర్శకుడు క్రిష్ మొదటి చిత్రం గమ్యంలో గాలి శీను పాత్ర వేసిన అల్లరి నరేష్ ని క్లైమాక్స్ లో చంపేసారు. అలాగే తర్వాత చిత్రం వేదంలో అల్లు అర్జున్, మనోజ్ పాత్రలను చంపేస్తారు. మరి మూడవ చిత్రంలోనూ ఇలా హీరోలను చంపేయటానికి ప్లాన్ చేస్తున్నారా అంటే...ఆయన నవ్వుతూ ఈసారి హీరోను చంపను లెండి అన్నారు. అలాగే చంపటం గురించి చెపుతూ..ఆడియన్స్ ని చంపటం కన్నా కథలో హీరోలని చంపటం బెస్ట్ అనుకున్నా అని క్లారిఫై చేసారు. ఇక తమిళంలో వేదం రీమేక్ చేసిన క్రిష్ ఈ సారి తమిళ,తెలుగు భాషల్లో కలిసి సినిమా చేయనున్నానని చెప్పారు. అయితే కథ ఎక్కడ ఓకే అయ్యిందనేది మాత్రం పెదవి విప్పలేదు. పరిశ్రమలో మాత్రం క్రిష్...రామ్ చరణ్ తో కథ ఓకే చేయించుకున్నారని వినిపిస్తోంది. అయితే రామ్ చరణ్ మాత్రం ప్రయోగాత్మక చిత్రాలకు ఆసక్తి చూపకపోవటంతో ఈ పాజెక్టు ఎంతవరకూ ముందుకు వెళ్ళుతుందనేది అందరిలో సందేహం ఏర్పడింది. అలాగే తెలుగు,తమిళంలో మార్కెట్ అయ్యే హీరోతో చెయ్యాలనే ఆలచనతో క్రిష్ ఉన్నారు. అలాగే అనూష్క ఆయన తదుపరి చిత్రంలో చేస్తుందా అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications











