»   » సూపర్బ్ :చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ కు డైరక్టర్ క్రిష్ ఫెరఫెక్ట్ మెసేజ్

సూపర్బ్ :చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ కు డైరక్టర్ క్రిష్ ఫెరఫెక్ట్ మెసేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మన తెలుగువారికి పెద్ద పండగ మాత్రమే కాదు...తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద సీజన్ కూడా సంక్రాంతే. ఈ సీజన్‌లో తమ సినిమా వస్తే సూపర్ హిట్టే అని ప్రతి హీరో ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రెండు ప్రతిష్టాత్మక సినిమాలు విడుదలవుతున్నాయి.

అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న 'ఖైదీ నెం 150' కాగా, మరొకటి నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ రెండు సినిమాలూ ఇప్పటికే భారీ అంచనాలను మూటగట్టుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల తేదీని జనవరి 12గా ఎప్పుడో నిర్ణయించేశారు. ఖైదీ నెం. 150 కోసం జనవరి 11, 12 రెండు తేదీలనూ పరిశీలిస్తూ వచ్చిన ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ తాజాగా 11వ తేదీని ఫిక్స్ చేసేశారు.


Director Krish message to Chiranjeevi and Balakrishna fans!

భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ రెండు సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరికీ మైలురాయి సినిమాలు కూడా కావడంతో సాధారణంగానే అభిమానుల మధ్యన పోటీ వాతావరణం కూడా కనిపిస్తోంది.


ఇక తాజాగా ఈ సినిమాల్లో ఒకటైన గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడైన క్రిష్, ఇద్దరు హీరోల అభిమానులకు ఓ సందేశమిచ్చారు. ఇద్దరు లెజెండ్స్ తమ ల్యాండ్‌మార్క్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని, ఇద్దరికీ ఘన స్వాగతం పలకాలని కోరుతున్నానని క్రిష్ అన్నారు. ఖైదీ నిర్మాత రామ్ చరణ్ సైతం రెండు సినిమాలూ విజయం సాధించాలని ఆశించారు.''ఈ సంక్రాంతికి తమ ల్యాండ్ మార్క్ ఫిలింస్ తో ఎంటర్టయిన్ చేయడానికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు. #Jan11Khaidi #Jan12GPSK ట్రెండింగ్ చేసి.. వారికి స్వాగతం పలుకుదాం'' అంటూ ట్వీటేశాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే వెబ్ మీడియాలో రచ్చ చేస్తున్న కొన్ని రూమర్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేయడానికి క్రిష్ వేసిన ట్వీట్ ఉపయోగపడింది.


నిజానికి ఈరోజు రామ్ చరణ్ అఫీషియల్ గా జనవరి 11న ఖైదీ నెం 150 సినిమా రిలీజ్ అవుతోందని.. 12న బాలయ్య వస్తున్నారు కాబట్టి.. తాము ఒక రోజు ముందు వస్తున్నామని ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన వచ్చిన వెంటనే.. అసలు బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను కూడా 11నే తేవాలని అంటున్నారని వార్తలు వచ్చేశాయి.


నిజానికి అలా ఒకటే రోజును సినిమా రిలీజ్ చేస్తే.. ఫ్యాన్స్ తాలూకు ఈగో శాటిస్ఫై అవుతుందేమో కాని.. ప్రొడ్యూసర్లకు మాత్రం దెబ్బే పడుతుంది. బయ్యర్లకు కూడా కష్టమే. కాని ఇక్కడ మాత్రం బయ్యర్లే ప్రీ-పోన్ చేయమంటున్నారు అంటూ రూమర్లు వినిపించారు. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్ కు క్రిష్ పై ట్వీటుతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఏదేమైనా కూడా.. పోటీ వాతవరణం ఆరోగ్యవంతంగా ఉంటేనే బెటర్. ప్రతీ దానికి అభిమానులు ఇలా అభిమానం పేరుతో రచ్చ చేస్తే మాత్రం అందరికీ నష్టమే అని చెప్తున్నారు.


English summary
Director Krish tweeted "This #Sankranthi two legends r coming to entertain us with their landmark films. Let us all welcome both by trending #Jan11Khaidi #Jan12GPSK"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu